రాబోయే 4 నెలల్లో విడుదలకు రెడీగా ఉన్న క్రేజీ మూవీలు ఇవే..!

Pulgam Srinivas
వచ్చే నెల నుండి కొన్ని సినిమాలు భారీ అంచనాలతో విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి. అలా వచ్చే నెల నుండి 4 నెలల పాటు విడుదల కాబోయే మంచి క్రేజ్ ఉన్న సినిమాలు ఏవో తెలుసుకుందాం.
హనుమాన్ : తేజ సజ్జ హీరో గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ని మే 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
కస్టడీ : అక్కినేని నాగ చైతన్య హీరో గా కృతి శెట్టి హీరోయిన్ గా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ని మే 12 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు.
చత్రపతి : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో గా వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ హిందీ సినిమాను మే 12 వ తేదీన విడుదల చేయనున్నారు.
జవాన్ : షారుక్ ఖాన్ హీరో గా అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ని జూన్ 2 వ తేదీన విడుదల చేయనున్నారు.
ఆది పురుష్ : రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా కృతి సనన్ హీరోయిన్ గా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ని జూన్ 16 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించాడు.
యానిమల్ : రన్బీర్ కపూర్ హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా రూపొందుతున్న ఈ మూవీ కి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని ఆగస్టు 11 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంతరాలు నెలకొని ఉన్నాయి.
రాబోయే 4 నెలల్లో విడుదల కాబోయే సినిమాల్లో ఈ మూవీ లపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: