టీజర్ : రానానాయుడు-2 సిరీస్ టీజర్..!!

Divya
హీరో విక్టరీ వెంకటేష్ ,దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ త్రిల్లర్ సిరీస్  రానానాయుడు. సీజన్ వన్ కు ఎంతటి పాపులారిటీ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ సీజన్ వల్ల ఎన్నోసార్లు ట్రోలింగ్ కూడా గురైన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా వెంకటేశుని కూడా విమర్శించేవారు పెరిగిపోయారు. దీంతో రానానాయుడు వెబ్ సిరీస్ తెలుగులో తొలగించడం జరిగింది. తాజాగా రామానాయుడు సిజన్ -2 కు సంబంధించి ఒక టీజర్ ని విడుదల చేయడం జరిగింది.

అందుకు సంబంధించి ఓటిటి ప్లాట్ ఫామ్ అయినా  నెట్ ఫ్లెక్స్ అధికారికంగా ఒక వీడియోని తన ట్విట్టర్ నుంచి తెలియజేసింది.. అంతేకాకుండా మరేం చిందించకండి మీ బాధనంతటిని పోగొట్టడానికి నాయుడులు మళ్లీ తిరిగి వస్తున్నారు అంటూ పైన క్యాప్షన్ కూడా జత చేయడం జరిగింది. రానానాయుడు సీజన్-2 త్వరలోనే విడుదల కాబోతోంది అంటూ రాసుకుంది.అద్వంతం ఆసక్తి రేపుతున్న ఈ సీజన్-2 గ్లింప్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ప్రముఖ అమెరికన్ టీవీ రేడోవన్ ఆధారంగా ఈ సిరీస్ ను రూపొందించడం జరిగింది.

రానానాయుడు సిరీస్ మార్చి 10వ తేదీన ఓటీటి ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్ లో విడుదల చేయబోతున్నారు. విడుదలైన మూడు వారాలపాటు భారతదేశంలో అత్యంత వీక్షించబడిన సిరీస్ గా మొదటి స్థానంలో నిలిచింది. వరుసగా ఐదవ వారంలో దేశంలో టాప్ టెన్ సిరీస్ లలో ఒకటిగా నిలిచిన రామానాయుడు విడుదలైన రెండు వారాలపాటు నాన్ ఇంగ్లీష్ టీవీలో కోసం నెట్ఫ్లిక్స్ గ్లోబల్ టాప్ టెన్ లో కూడా ట్రెండీగా మారిపోయింది. సుందర్ అరుణ్.. లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించారు. ఇక ఇందులో తదితర నటీనటుల సైతం నటించడం జరిగింది. వెంకటేష్ ప్రస్తుతం సైంధవ అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమా కూడా థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న సినిమా కావడం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: