"ఇండియన్ 2" మూవీ తాజా షెడ్యూల్ పూర్తి..!

Pulgam Srinivas
దేశం కల్పించేదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శంకర్ ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన Balck బస్టర్ మూవీ లకు దర్శకత్వం వహించి ఇండియా లోనే గొప్ప దర్శకుడి గా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే శంకర్ ప్రస్తుతం ఏకకాలంలో లోక నాయకుడు కమల్ హాసన్ హీరో గా రూపొందుతున్న ఇండియన్ 2 మూవీ కి ... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా రూపొందుతున్న గేమ్ చేంజర్ మూవీ కి దర్శకత్వం వహిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ దర్శకుడు ఒక మూవీ షెడ్యూల్ పూర్తి అయిన తర్వాత మరొక షెడ్యూల్ ప్రారంభిస్తూ పక్కా ప్లానింగ్ తో ఈ రెండు మూవీ ల షూటింగ్ లను పూర్తి చేస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే శంకర్ "ఇండియన్ 2" మూవీ కి సంబంధించిన కొత్త షెడ్యూల్ షూటింగ్ ను ప్రారంభించాడు.

తాజాగా ఈ మూవీ షెడ్యూల్ పూర్తి అయినట్లు శంకర్ తన సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు. శంకర్ తన సోషల్ మీడియా ద్వారా ఈ పవర్ ప్యాకెట్ షెడ్యూల్ కు ధన్యవాదాలు ... కమల్ హాసన్ సార్ మళ్లీ కలుద్దాం అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశాడు. ప్రస్తుతం శంకర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇండియన్ 2 మూవీలో కాజల్ అగర్వాల్ ... రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలలో నటిస్తూ ఉండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: