పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్న ప్రభాస్...!!

murali krishna
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో సలార్ కూడా ఒకటి. కె జి ఎఫ్ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. కెజిఎఫ్ సినిమాను నిర్మించిన హోంబోలే సంస్థనే ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, లీక్డ్ పిక్స్ తో సినిమా అంచనాలు బాగా పెరిగాయి.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తుండగా.. మలయాళ స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్  నటిస్తున్నాడట.. ఇక ప్రశాంత్ నీల్  అంటే.. తన సినిమాలో హీరోలు  హీరోల్లా అయితే కనిపించరు.. విలన్స్ గానే ఎక్కువగా కనిపిస్తారు. ఉగ్రం, కెజిఎఫ్ 1 , కెజిఎఫ్ 2 లో హీరోలు నెగెటివ్ షేడ్స్ తోనే బాగా ఎస్టాబలిష్ అయ్యారు. ఇక ఈ పంథానే సలార్ లో చూడబోతున్నామని తెలుస్తుంది.
ప్రభాస్ కూడా సలార్ లో విలన్ గానే నటిస్తున్నాడని సమాచారం.. ఇప్పటికే ఈ చిత్రంలో ప్రభాస్ ఫర్మాన్ అనే క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు ముందుగానే చెప్పుకొచ్చాడట.అది కాకుండా విలన్ రోల్ కూడా ఉండనుందని తెలుస్తుంది.. ప్రభాస్ దేవా అనే పాత్ర.. విలన్ పాత్ర అని సమాచారం.. అతి క్రూరమైన, కనికరంలేని అలాగే పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ గా ప్రభాస్ కనిపించనున్నాడనీ తెలుస్తుంది.. పెద్ద పెద్ద క్రిమినల్స్ కూడా భయపడే రేంజ్ లో అతని పాత్రని ప్రశాంత్ నీల్ డిజైన్ చేసారని సమాచారం..

ఈ విషయం తెలియడంతో డార్లింగ్ ఫ్యాన్స్ కూడా ఎగిరి గంతేస్తున్నారు. మా అన్నను రాఖీ భాయ్  కంటే కఠినమైన విలన్ చూపించబోతున్నారని బాగా ఆనందంగా వున్నారు.. ఇందులో నిజం ఎంత అనేది మాత్రం తెలియదు కానీ, ఒకవేళ ఇదే కనుక నిజామైతే బాక్సాఫీస్ బద్దలు అవ్వడం మాత్రం ఖాయం అంటున్నారట రెబల్ స్టార్ ఫ్యాన్స్…

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: