5 రోజుల్లో "శాకుంతలం" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడుగా మంచి గుర్తింపు కలిగిన వారిలో ఒకరు అయినటు వంటి గుణశేఖర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు తాజాగా శాకుంతలం అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. దేవ్ మోహన్ ... సమంత హీరో హీరోయిన్ లుగా నటించిన ఈ సినిమాను ఏప్రిల్ 14 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలో విడుదల చేశారు. ఈ సినిమా ఇప్పటి వరకు 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ  5 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
1 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.24 కోట్ల షేర్ ... 4.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
2 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.71 కోట్ల షేర్ ... 1.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
3 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.65 కోట్ల షేర్ ... 1.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
4 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.28 కోట్ల షేర్ ... 0.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
5 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.16 కోట్ల షేర్ ... 0.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
మొత్తంగా 5  రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 4.04 కోట్ల షేర్ ... 8.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ ని 2D మరియు 3D వర్షన్ లలో విడుదల చేశారు. మోహన్ బాబు ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: