డిసెంబర్ వరకు ప్రస్తుత సినిమాల పనులను ముగించనున్న ప్రభాస్..!

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆది పురుష్ మూవీ షూటింగ్ ను ప్రభాస్ పూర్తి చేసుకున్నాడు. ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో విడుదల కాబోతోంది. ఇది ఇలా ఉంటే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ "సలార్" సినిమా షూటింగ్ ను చాలా రోజుల క్రితమే ప్రారంభించాడు. ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కావడంతో ఈ సినిమా చిత్రీకరణ కొంత ఆలస్యం అవుతూ వస్తుంది.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ కే అనే మూవీ లో ప్రభాస్ హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని పాన్ వరల్డ్ మూవీ గా రూపొందిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అమితా బచ్చన్ ... దిశా పటాని ఈ మూవీ లో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ ను కూడా డిసెంబర్ లోపు పూర్తి చేసుకోవాలి అని ప్రభాస్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.

ఈ రెండు మూవీ ల షూటింగ్ లతో పాటు ప్రభాస్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో పీపుల్స్ మీడియా సంస్థ రూపొందిస్తున్న మరో మూవీ లో కూడా హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ షూటింగ్ కూడా డిసెంబర్ లోపే పూర్తి చేసుకోవాలి అని ప్రభాస్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇలా డిసెంబర్ లోపు ఈ మూడు సినిమాల షూటింగ్ లను పూర్తి చేసుకుని వచ్చే సంవత్సరం మరో రెండు కొత్త సినిమాలను ప్రారంభించాలి అని ప్రభాస్ ప్రణాళికలను వేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: