నాని 30 వ మూవీ బాలీవుడ్ ఆడియో రైట్స్ కు క్రేజీ ఆఫర్..?

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని తాజాగా దసరా అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించిన ఈ మూవీ లో మహానటి కీర్తి సురేష్ ... నాని సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో మార్చి 30 వ తేదీన విడుదల అయ్యి ఇప్పటికే అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వాసులు చేసి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

ఇలా దసరా మూవీ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న నాని ప్రస్తుతం తన కెరీర్ లో 30 వ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ సినిమాల్లో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా కనిపించబోతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... తాజాగా నాని నటించినటు వంటి దసరా మూవీ పాటలు బాలీవుడ్ లో కూడా సూపర్ హిట్ అయ్యాయి.

దానితో నాని కి మంచి క్రేజ్ బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఏర్పడింది. దానితో నాని ప్రస్తుతం నటిస్తున్న 30 వ సినిమా హిందీ ఆడియో రైట్స్ ను ప్రముఖ ఆడియో సంస్థ అయినటు వంటి టి సిరీస్ సంస్థ 8 కోట్ల కు దక్కించుకున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే నాని 30 వ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 21 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బంధం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: