చిరంజీవి, బాలయ్యతో రొమాన్స్ అంటే.. చాలా ఇష్టం : కుష్బూ

praveen
నిన్నటి తరం హీరోయిన్ల లో ఇప్పటికీ ప్రేక్షకులకు దగ్గరగా ఉంది కేవలం కొంతమంది మాత్రమే.  అలాంటి కొంతమందిలో ఇప్పటికీ తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఇక ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ అలరిస్తున్న హీరోయిన్ కుష్బూ. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా కుష్బూ ఎంతలా హవా నడిపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు తమిళం కన్నడం అనే తేడా లేకుండా అన్ని భాషల్లో స్టార్ హీరోలు అందరితో కూడా జోడి కట్టింది. ఏకంగా కోలీవుడ్లో అయితే కుష్బూ అందానికి ఫిదా అయిపోయిన అభిమానులు గుడి కట్టేశారు అని చెప్పాలి.

 ఇప్పటికీ కూడా ఆ గుడి అలాగే ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు నేటితరం స్టార్ హీరోల సినిమాలు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది కుష్బూ. ఈ క్రమంలోనే గోపీచంద్ హీరోగా తెరకెక్కిన రామబాణం అనే సినిమా మరికొన్ని రోజుల్లో విడుదలవ్వ నుండగా  ఈ సినిమాలో కీలకపాత్రలో నటించిన కుష్బూ ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది అని చెప్పాలి. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఖుష్బూ తాను స్టార్ హీరోయిన్గా కెరియర్ సాగిస్తున్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది అని చెప్పాలి.

 మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ లతో రొమాన్స్ చేయడానికి ఎంతో ఇష్టపడతాను అంటూ కుష్బూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే కుష్బూ చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయి. అంతేకాకుండా తన క్రేజీ హీరో బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ అంటూ తెలిపింది. ఇప్పటికీ నా దగ్గర అమితాబచ్చన్ పోస్టర్లు ఉన్నాయి అంటూ ఇక ఆయనపై ఉన్న అభిమానాన్ని తన మాటల్లో చెప్పేసింది కుష్బూ. వారసుడు సినిమాలో తన పాత్ర కనిపించకపోవడం పై స్పందిస్తూ.. తన పాత్ర 18 నిమిషాలు ఉంటే దానిని ఎడిటింగ్ లో కట్ చేశారు అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: