NTR -30: అలాంటి వార్తలకు చెక్ పెట్టారుగా..!!

Divya
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ntr -30 ఈ సినిమా ఈ వర్కింగ్ టైటిల్ తోనే సెట్స్ పైకి వెళ్లడం జరిగింది. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్ మొదలై ఫస్ట్ షెడ్యూల్ను కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫ్యూజ్ యాక్షన్ బ్లాక్ ని ఫస్ట్ షెడ్యూల్లో స్టార్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక సెకండ్ షెడ్యూల్ ని కూడా మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. రామోజీ ఫిలిం సిటీ లో నైట్ ఎఫెక్ట్తో ఎన్టీఆర్ 30వ సినిమా సెకండ్ షెడ్యూల్ మొదలైనట్లుగా సమాచారం.అది కూడా ఈరోజు నుంచి మొదలవబోతున్నట్లు తెలుస్తోంది.
ఇందులో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ జాయిన్ అయినట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ కి విలన్ గా నటిస్తున్నారని వార్త గత కొద్దిరోజులుగా వినిపిస్తూనే ఉన్నది. ఈ వార్త నిజం చేస్తూ మేకర్ ఎన్టీఆర్ సంబంధించి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇక ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ నుంచి జాయిన్డ్ ది షూట్ ఆఫ్ ది హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్ అంటూ ఒక ట్విట్ ని షేర్ చేయడం జరిగింది..
పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాని విడుదల చేయడం జరుగుతోంది .ఇందులో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నది. డైరెక్టర్ కొరటాల శివ సైఫ్ అలీఖాన్ని విలన్ గా చూపించడంతో ఈ సినిమాకు మంచి మార్కెట్ పెంచి విషయం అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే ప్రభాస్ తో కలిసి ఆదిపురష్ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటిస్తున్నారు.. ఈ నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్తో ఎన్టీఆర్ పోటీపడితే ఆన్ స్క్రీన్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.. మరి రాబోయే రోజుల్లో సైఫ్ అలీ ఖాన్ ఎన్ని సినిమాలలో నటిస్తారో చూడాలి. అయితే గతంలో మాత్రం జాన్వీ కపూర్ ఎన్టీఆర్ను రిజెక్ట్ చేసిందని సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ ని రిజెక్ట్ చేశారని వార్తలు వినిపించాయి కానీ ఇవన్నీ కేవలం రూమర్స్ అన్నట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: