అఖిల్ ఏజెంట్ ట్రైలర్.. అంచనాలకు మించి..!

shami
అక్కినేని హీరో అఖిల్ లేటెస్ట్ మూవీ ఏజెంట్ ట్రైలర్ రిలీజైంది. అఖిల్ ముందునుంచి చెబుతున్నట్టుగానే సినిమా చాలా గ్రాండ్ గా తెరకెక్కించారని మాత్రం అర్ధమవుతుంది. ట్రైలర్ మొత్తం చాలా గ్రాండియర్ గా భారీతనంతో ఉంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సెస్ అయితే నెక్స్ట్ లెవల్ అని చెప్పొచ్చు. అఖిల్ ఏజెంట్ మీద ఎందుకు ఇంత కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు అన్నది ఈ ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ఏజెంట్ ట్రైలర్ అంచనాలకు మించి ఉంది. ఈ సినిమా అఖిల్ కు తప్పనిసరిగా మంచి మాస్ ఇమేజ్ తెచ్చి పెడుతుందని చెప్పొచ్చు.
ఏజెంట్ సినిమాపై మొదటి నుంచి ఒక నెగిటివ్ టాక్ ఉంది. కానీ ఈ ట్రైలర్ చూశాక మాత్రం ఆ అనుమానాలు అన్నీ పటాపంచలు అయ్యాయి. పర్ఫెక్ట్ ట్రైలర్ కట్ గా సినిమా కమర్షియల్ మీటర్ కు తగినట్టుగా అనిపించింది. అఖిల్ ఈ సినిమాతో కచ్చితంగా మాస్ హిట్ కొడతాడని అనిపిస్తుంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్ టాలెంట్ ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ కాబోతుంది. సైరా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఏజెంట్ తీశాడు సురేందర్ రెడ్డి. ఈ సినిమాకు బ్లడ్ అండ్ స్వెట్ అన్నీ ఇచ్చేశాడని చెప్పొచ్చు.
ఏజెంట్ ట్రైలర్ లో మమ్ముక్క అదే మమ్ముట్టి కూడా అదరగొట్టేశారు. సినిమాలో ఆయనది గెస్ట్ రోల్ అనుకున్నారు కానీ ఏజెంట్ ని గైడ్ చేసే రోల్ గా.. మమ్ముట్టి కూడా సినిమాలో వన్ ఆఫ్ ది కీ రోల్ అని తెలుస్తుంది. తప్పకుండా ఏజెంట్ అఖిల్ అండ్ టీం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుందని చెప్పొచ్చు. ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ అవుతుంది. ఆ డేట్ న రిలీజైన సినిమాలు ఇండస్ట్రీ రికార్డులు సృష్టించాయి. మరి అదే సెంటిమెంట్ రిపీట్ చేస్తూ ఏజెంట్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తాడా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: