పవన్ కళ్యాణ్ మరియు నాగార్జున తో డేటింగ్ చేయాలనీ ఉంది :: సురేఖ వాణి

murali krishna
కొన్ని సినిమాల్లో కొందరు కొన్ని పాత్రల్లో నటించి మంచి గుర్తు తెచ్చుకుంటారు. అలాంటి నటులకి ఇండస్ట్రీ లో మంచి పేరు ఉంటుంది అయితే కొంత మంది కొన్ని క్యారెక్టర్స్ ని చాలా అద్బుతం గా పోషిస్తారు అలాంటి నటీమణుల్లో సురేఖ వాణి ఒకరు.ఎన్నో సినిమాల్లో హీరో హీరోయిన్లకు అక్క, వదిన, పిన్ని పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

మరీ ముఖ్యంగా బ్రహ్మానందం సరసన కోవై సరళ తర్వాత ఎక్కువగా భార్య పాత్రల్లో నటించింది సురేఖ వాణి అని చెప్పుకోవచ్చు. అలాంటి సురేఖ వాణి ఈమధ్య కాలంలో సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు.కానీ సోషల్ మీడియాలో మాత్రం తన కూతురితో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియానే షేక్ చేస్తోంది.అసలు ఆమె ఎక్కడ తగ్గట్లేదు అనే చెప్పాలి.

అంతేకాదు కూతురితో పాటు పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటూ రచ్చ రచ్చ చేస్తుంది.ఇక ఆమె వేసే బట్టలకు చాలా మంది నెటిజన్స్ భర్త పోయాక కూడా ఇవేం అలవాట్లు అంటూ విమర్శిస్తున్నప్పటికీ వారి మాటలు పట్టించుకోవడం లేదు. ఇక సురేఖవాణి అవకాశాలు లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.అయితే తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సురేఖవాణి తన కూతురు సుప్రీత ఇద్దరూ కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పారు.ఆ యూట్యూబ్ ఇంటర్వ్యూలో యాంకర్ సురేఖ వాణి కూతురు సుప్రీతను మీ అమ్మకు ఏ హీరో అంటే ఇష్టం, ఏ హీరోతో డేట్ కి వెళ్తుంది అని అడిగితే ఆలోచించకుండా సుప్రీతా టక్కున మా అమ్మకి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. కుదిరితే పవన్ కళ్యాణ్ తో డేటింగ్ కి వెళుతుంది. అంతేకాదు, అక్కినేని నాగార్జున గారు అంటే కూడా చాలా ఇష్టం. ఆ హీరో తో కూడా డేటింగ్ కి వెళ్తుంది అంటూ చెప్పింది. అలాగే ఎవరికైనా 100 ముద్దులు ఇవ్వాల్సి వస్తే మీరు ఏ హీరోకి ఇస్తారు అని సురేఖ వాణి ని అడిగితే ఏమాత్రం ఆలోచించ కుండా సురేఖ వాణి నేను పవన్ కళ్యాణ్ కి 100 ముద్దులు ఇస్తాను అంటూ మొహమాటం లేకుండా చెప్పేసింది. దాంతో ప్రస్తుతం సురేఖ వాణి,సుప్రీత మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక కొంతమంది ఈ వీడియోకి పాజిటివ్ కామెంట్లు పెడితే మరి కొంతమంది నెగటివ్ కామెంట్లు పెడుతున్నారు.ఎంతైనా తన ఎత్తు ఉన్న కూతురు ఉండగా పరాయి మగాళ్ళ గురించి ఇంత ఓపెన్ గా మాట్లాడటం పట్ల నెటిజన్స్ తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు ఎందుకు ఆమె ఆ రకం గా మాట్లాడుతుంది అనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు.దీన్ని బట్టి చూస్తే సురేఖ వాణి సినిమాలు చేయకపోయినా పర్లేదు కానీ నిత్యం న్యూస్ లో ఉండాలని చూస్తున్నట్టు గా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: