షూటింగ్ చివరి దశలో సలార్?

Purushottham Vinay
పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మరో భారీ యాక్షన్ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా సలార్..ఈ సినిమాకు కెజీయఫ్ దర్శకుడు అయిన ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్నో భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో చాలా స్పీడ్ గా జరుగుతోంది. అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావోచ్చిందని సమాచారం తెలుస్తోంది.మొన్నటిదాకా సలార్ సినిమా షూటింగ్ ఇటలీలోని మటేరాలో జరుగింది. జేమ్స్ బాండ్ సినిమా "నో టైమ్ టు డై" సినిమాలోని కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కూడా ఇక్కడ షూట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ స్టేజ్ లోకి వచ్చేసిందని సమాచారం తెలుస్తోంది. ప్రస్తుతం మేకర్స్ లాస్ట్ షెడ్యూల్‌ను స్టార్ట్ చేశారట. దీంతో ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తిగా కంప్లీ్ట్ కానుందని సమాచారం తెలుస్తోంది. ఈ సినిమా షెడ్యూల్ ఓ తొమ్మిది రోజులు మాత్రమే ఉంటుంది అని సమాచారం తెలుస్తుంది. దీనితో  సలార్ సినిమాకి గుమ్మడికాయ కొట్టేస్తారట టీమ్. ఈ సినిమా ఈ సంవత్సరం సెప్టెంబర్ 28 వ తేదీన చాలా గ్రాండ్‌గా విడుదలకానుంది.ఇంకా ఈ సినిమాకేవలం పాన్ ఇండియా మాత్రమే కాదట, ఇది పాన్ వరల్డ్ సినిమా అని సమాచారం తెలుస్తోంది.


అందులో భాగంగా ఈ సినిమా ఇంగ్లీష్‌లో కూడా విడుదలకానుందని సమాచారం తెలుస్తోంది. అయితే ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన అనేది విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా స్టార్ బ్యూటీ శృతి హాసన్ నటిస్తోంది. హాలీవుడ్ లెవెల్ లో ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. అలాగే యాక్షన్ సిక్వెన్స్‌ను హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్‌ కొరియోగ్రఫి చేస్తున్నారు. ఎన్నో భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 28 వ తేదీన చాలా గ్రాండ్‌గా విడుదల కానుంది.ఈ సినిమాకి సంబంధించి శాటిలైట్ హక్కులు భారీ మొత్తం చెల్లించి స్టార్ మా కొనుగోలు చేసినట్లు సమాచారం తెలుస్తోంది. కెజీయఫ్ సినిమాలకు సంగీతం అందించిన రవి బసృర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. హోంబళే ఫిలిమ్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది.. 'సలార్' సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ చిన్న డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వస్తున్న హార్రర్ సినిమా రాజా డీలక్స్ సినిమాకు షిప్ట్ కానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: