శాకుంతలంకి భారీ నష్టాలు?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మరో బిగ్ బడ్జెట్ మూవీ 'శాకుంతలం'. సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని 'గుణ టీం వర్క్స్' 'శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్' బ్యానర్ పై నీలిమ గుణ ఇంకా దిల్ రాజు కలిసి నిర్మించడం జరిగింది.ఇక ఏప్రిల్ 14 వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు మొదటి షోతోనే దారుణమైన నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది.శకుంతల- దుష్యంతుల ప్రేమ కథని దర్శకుడు గుణశేఖర్ అంత ఎంగేజింగ్ గా రూపొందించలేకపోయాడు. దీంతో బాక్సాఫీస్ వద్ద చాలా దారుణంగా బ్యాడ్ పెర్ఫార్మన్స్ ఇస్తుంది ఈ మూవీ. ఒకసారి 'శాకుంతలం' చిత్రం వసూలు చేసిన 4 డేస్ కలెక్షన్స్ ను కనుక గమనిస్తే..ఈ 'శాకుంతలం' చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ మొత్తం రూ.17.5 కోట్లు అని సమాచారం తెలుస్తుంది.

ఇక 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా కేవలం రూ.3.92 కోట్ల షేర్ ను మాత్రమే వసూలు చేసింది. బ్రేక్ ఈవెన్ కి ఈ సినిమా కేవలం రూ.13.58 కోట్ల షేర్ ను మాత్రం రాబట్టాల్సి ఉంది. మాములుగా ఇది చిన్న టార్గెట్ మాత్రమే అయిన ఈ సినిమాకి ఇప్పుడు చాలా టఫ్ టార్గెట్గా మారింది.వీకెండ్ ను కూడా ఏమాత్రం వాడుకాలేకపోయిన ఈ సినిమా సోమవారం రోజున కూడా పెద్దగా వసూళ్ళని రాబట్టలేకపోయింది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ లు కూడా అంతగా కనిపించడం లేదు.డిజాస్టర్ టాక్ ని సంపాదించుకోవడంతో ఈ సినిమా చాలా దారుణంగా వసూళ్లలో వెనకబడి పొయింది.దాదాపు 80 కోట్లకు పైగా ఈ సినిమాకి లాస్ వచ్చినట్లు సమాచారం తెలుస్తుంది.ఇక ఈ సినిమా ఇచ్చిన దెబ్బతో సమంతకి అవకాశాలు మళ్ళీ వస్తాయో రావో చూడాలి.కొంత కాలం నుంచి కూడా సమంతకి వరుస ప్లాపులు తప్పట్లేదు. ఇక ఈ సినిమా ఇచ్చిన ప్లాప్ తో సమంత కోలుకుంటుందో లేదో చూడాలి. దిల్ రాజు కూడా ఈ సినిమాతో చాలా నష్టపోయాడు.దిల్ రాజు కూడా ఈమధ్య కాలంలో భారీ సినిమాల వల్ల భారీ నష్టాలతో ఎంతగానో సతమతం అవుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: