చరణ్ మూవీ కోసం భారీ సెట్..?

Pulgam Srinivas
టాలీవుడ్ స్టార్ హీ రోలలో ఒకరు అయినటు వంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోయిన సంవత్సరం విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన విషయం అందరికీ తెలిసిందే . ఇలా ఆర్ ఆర్ ఆర్ మూవీ తో గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్న చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో ... అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు .

ఈ మూవీ దిల్ రాజు బ్యానర్ లో 50 వ మూవీ గా రూపొందుతుంది. ఎస్ జె సూర్య విలన్ పాత్రలో నటిస్తున్న ఈ మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది . అంజలి ... సునీల్ ... శ్రీకాంత్ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనుండగా ... తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు . ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఒక పాత్రలో గ్రామీణ యువకుడి గాను ... మరొక పాత్రలో సిటీ కల్చర్ వ్యక్తి గాను కనిపించబోతున్నట్లు తెలుస్తుంది . 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీ కోసం చిత్ర బృందం ఒక ప్రత్యేక సెట్ ను వేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్ కోసం చిత్ర బృందం చాలా ఖర్చు చేసినట్లు సమాచారం . ఈ సెట్ లో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది . ఈ సెట్ లో ఉండే రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సన్నివేశం అద్భుతంగా ఉండబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: