చీర కట్టులో ట్రెడిషనల్ లుక్ లో మైమరపిస్తున్న బాలయ్య హీరోయిన్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలం లోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ కంచే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత పలు మూవీ లలో నటించి తన గుర్తింపును మరింతగా పెంచుకుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఈ ముద్దు గుమ్మ బాలయ్య హీరోగా రూపొందిన అఖండ మూవీ లో హీరోయిన్ గా నటించింది. 
ఈ సినిమా మంచి విజయం సాధించడం ... అలాగే ఈ మూవీ లో ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో ... నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఆఖండ మూవీ తో ప్రగ్యా క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో భారీగా పెరిగిపోయింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన హాట్ స్కిన్ షో తో కుర్రకారును హిట్ ఎక్కించిన ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందచందాలను ఆరబోస్తూ వస్తుంది. 

అందులో భాగంగా ఇప్పటికీ అనేక సార్లు ఈ ముద్దుగుమ్మ తన అందచందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే అప్పుడప్పుడు తనకు సంబంధించిన వెరీ క్లాస్ అండ్ డీసెంట్ అండ్ ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా ప్రగ్య క్లాస్ లుక్ లో చీర కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఒక ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: