"భోళా శంకర్" మూవీలో అదిరిపోయే కామెడీ ట్రాక్..?

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో తమన్నా ... చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇది వరకు వీరిద్దరి కాంబినేషన్ లో సైరా నరసింహా రెడ్డి అనే భారీ బడ్జెట్  పాన్ ఇండియా మూవీ రూపొందింది. భోళా శంకర్ మూవీ వీరి కాంబినేషన్ లో రెండవ సినిమా. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో కీర్తి సురేష్ ... చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటిస్తూ ఉండగా ... సుశాంత్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. చాలా రోజుల క్రితం ప్రారంభం అయిన ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తి అయింది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన ఈ మూవీ నీ విడుదల చేనున్నట్లు ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక కేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... సిస్టర్ సెంటిమెంట్ తో సాగే ఈ సినిమాలో దర్శకుడు మెహర్ రమేష్ ఒక అదిరిపోయే కామెడీ ట్రాక్ ను ప్రిపేర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కామెడీ ట్రాక్ లో మెగాస్టార్ చిరంజీవి ... వెన్నెల కిషోర్ ... సత్య ... ఆది ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వీరితో మెహర్ రమేష్ డిజైన్ చేసిన కామెడీ ట్రాక్ అదిరిపోయే రేంజ్ లో వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా సిస్టర్ సెంటిమెంట్ తో సాగే ఈ సినిమాలో మెహర్ రమేష్ అదిరిపోయే కామెడీ ట్రాక్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: