వైట్ కలర్ శారీలో రెడ్ కలర్ బ్లౌజ్లో మైమరపిస్తున్న మాళవిక మోహన్..!

Pulgam Srinivas
తమిళ సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపును తెచ్చుకున్న ముద్దుగుమ్మలలో ఒకరు అయినటువంటి మాళవిక మోహన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో తమిళ మూవీ లలో నటించి తమిళ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. కొంతకాలం క్రితం మాళవిక మాస్టర్ అనే తమిళ మూవీలో హీరోయిన్ గా నటించింది.
 

దళపతి విజయ్ హీరోగా రూపొందిన ఈ మూవీ కి లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తెలుగు లో కూడా మాస్టర్ పేరుతో విడుదల అయింది. ఈ మూవీ అటు తమిళ్ ... ఇటు తెలుగు రెండు ప్రాంతాల్లోనూ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ ముద్దు గుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మాస్టర్ మూవీ తో మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మాళవిక ... ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వరుస క్రేజీ సినిమా అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ హాట్ బ్యూటీ ఇప్పటికే అనేక సార్లు తన సోషల్ మీడియా అకౌంట్ లో తరపు సంబంధించిన వెరీ హాట్ ఫోటోలను పోస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే.
 

అలాగే అప్పుడప్పుడు ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన చాలా క్లాస్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా మాళవిక వైట్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని ... రెడ్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి చాలా క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం మలవిక కు సంబందించిన ఈ పోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: