అఫీషియల్ : ఎన్టీఆర్ 30లో సైఫ్ అలీ ఖాన్ అప్డేట్ ప్రకటించిన మూవీ యూనిట్..!

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందుతుంది. దానితో ఈ సినిమా షూటింగ్ ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ యూనిట్ ప్రారంభించింది. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది.
 

మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయింది. తాజాగా ఈ మూవీ యొక్క రెండవ షెడ్యూల్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ రాత్రి వేళ సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ ను రామోజీ ఫిలిం సిటీ లో తెరకెక్కిస్తోంది. ఇది ఇలా ఉంటే జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.
 

ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నట్లు అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేసింది. తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ లో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ కొన్ని ఫోటోలను కూడా విడుదల చేసింది.
 

ఈ మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసిన ఫోటోలలో జూనియర్ ఎన్టీఆర్ ... కొరటాల శివ ... సైఫ్ అలీ ఖాన్ లు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై బాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా భారీ అంచనాలు పెరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: