"భోళా శంకర్" మూవీకి అనుకున్న బడ్జెట్ కంటే అంత ఎక్కువ అవుతుందా..?

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల అయినటు వంటి వాల్తేరు వీరయ్య అనే పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాలను విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

ఈ మూవీ కి బాబి దర్శకత్వం వహించగా ... శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ ని మైత్రి సంస్థ నిర్మించగా ... రవితేజ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఇలా వాల్తేరు వీరయ్య మూవీ తో సూపర్ సక్సెస్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న చిరంజీవి ప్రస్తుతం సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందుతున్న భోళా శంకర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... మహానటి కీర్తి సురేష్ ఈ మూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో కనిపించబోతోంది.

ఈ మూవీ ని తమిళ సినిమా అయినటువంటి వేదాలం మూవీ కి అధికారికంగా రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... మొదటగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాను 30 కోట్ల బడ్జెట్ తో రూపొందించాలి అని ప్లాన్ చేశారట ... కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ బడ్జెట్ పెరిగినట్లు తెలుస్తోంది. ఈ మూవీ మొత్తం కంప్లీట్ అయ్యే సరికి 80 కోట్ల వరకు బడ్జెట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: