మరో టాలీవుడ్ డైరెక్టర్ కు.. దళపతి విజయ్ ఛాన్స్?

praveen
ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ వరల్డ్ వైడ్ అయిపోయింది అన్న విషయం తెలిసిందే. దీనికి అంతటికీ కారణం దర్శకదీరుడు రాజమౌళి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజిలో తెలుగు సినిమా ఖ్యాతిని తీసుకువెళ్లిన రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా తెలుగు చిత్ర పరిశ్రమ పేరు మారుమోగిపోయేలా చేశాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక టాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేస్తే పాన్ ఇండియా రేంజ్ లో హిట్టు కొట్టవచ్చు అని ఎంతో మంది స్టార్ హీరోలు భావిస్తున్నారు.

 ఇక టాలీవుడ్ దర్శకులతో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ హీరోలు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు అని చెప్పాలి. కాగా గత కొంతకాలం నుంచి తమిళ ఇండస్ట్రీలో ఇళయ దళపతిగా కొనసాగుతున్న స్టార్ హీరో విజయ్ సైతం ఇలా టాలీవుడ్ డైరెక్టర్స్ పైన ఎక్కువగా దృష్టి పెట్టాడు అనేది తెలుస్తుంది. ఇప్పటికే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన వారసుడు అనే సినిమాలో నటించి సూపర్ హిట్ కొట్టాడు దళపతి విజయ్. ఇక ఇప్పుడు మరో టాలీవుడ్ డైరెక్టర్ తో సినిమాకు రెడీ అయిపోయాడు అన్నది తెలుస్తుంది.

 మొన్నటికి మొన్న వారసుడు సినిమాతో వంశీ పైడిపల్లికి చాన్స్ ఇచ్చిన విజయ్ ఇక ఇప్పుడు మరో తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో కలిసి పని చేసేందుకు సిద్ధమయ్యాడు అని చెప్పాలి. ఇందుకు సంబంధించి ఒక టాక్ ఇండస్ట్రీలో తెగచక్కర్లు కొడుతుంది. గోపీచంద్ మలినేని త్వరలోనే ఇక విజయ్ తో ఒక భారీ బడ్జెట్ సినిమాను తీయబోతున్నాడట. ఈ సినిమాను తెలుగు తమిళ కన్నడ భాషల్లో విడుదల చేయబోతున్నారట. ఇక ఈ సినిమాను అటు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రం అఫీషియల్ ప్రకటన వచ్చేంత  వరకు ఎవరికీ తెలియదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: