మెగాస్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆ డైరెక్టర్ కి దక్కెనా..!!

murali krishna
చిరంజీవి ఒక సాధారణ నటుడు కూడా మెగా స్టార్ అవ్వచ్చు అని నిరూపించిన వ్యక్తి సినిమా ఇండస్ట్రీ అనే కాకుండా ఏ ఫీల్డ్ లో ఉన్న వారైనా సరే చిరంజీవి ని ఎక్సమ్పుల్ గా తీసుకొని కష్టపడి పైకి ఎదగాలి అని అనుకుంటారు ఆలా చాలా మందికి చిరంజీవి అంటే ఇష్టం ఆయనంటే ఒక ఇన్స్పరేషన్...అలాగే ఆయన్ని చూసి మనం కూడా సినిమా ఇండస్ట్రీ కి వెళ్లి సినిమాలు తీయాలి అని అనుకోని ఏమి ఆలోచించకుండా ట్రైన్ ఎక్కి వచ్చిన వారిలో పూరి జగన్నాధ్ ఒక్కరు.
ఆయన ఇండస్ట్రీ లో డైరెక్టర్ అయి 23 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా కూడా పూరి చిరంజీవి తో సినిమా చేయలేకపోయాడనే చెప్పాలి...నిజానికి పూరి ఫస్ట్ సినిమా వచ్చినప్పటి నుంచే చిరంజీవి గారితో సినిమా తీయాలి అని అనుకున్నప్పటికీ అది ఎప్పుడు కుదరలేదు. చిరంజీవి కొడుకు అయినా రామ్ చరణ్ ని చిరుత సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం చేసింది పూరినే అయినప్పటికీ పూరి కి మాత్రం ఇప్పటి వరకు చిరు ని డైరెక్ట్ చేసే ఛాన్స్ అయితే రాలేదు.అయితే రీసెంట్ గా తెలుస్తున్న విషయం ఏంటంటే లైగర్ ప్లాప్ తో పూరి కి ఏ స్టార్ హీరో కూడా డేట్స్ ఇవ్వడం లేదు ఇలాంటి టైం లో పూరి తో చిరంజీవి సినిమా చేస్తున్నాడు అనే వార్త నెట్ లో తెగ హల్చల్ చేస్తుంది. చిరంజీవి సినిమాల్లోకి రి ఎంట్రీ ఇచ్చిన టైంలోనే పూరి తో సినిమా చేయాల్సింది కానీ అప్పుడు పూరి చెప్పిన ఆటో జానీ స్టోరీ లో చిరంజీవి కి సెకండ్ హాఫ్ నచ్చకపోవడం తో ఆ సినిమా అక్కడే ఆగిపోయింది...ప్రస్తుతం చిరంజీవి చేసిన వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ కి రెడీ గా ఉండడం తో ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ డైరెక్షన్ లో చేస్తున్న భోళా శంకర్ సినిమా కూడా ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్నందు వల్ల చిరంజీవి నెక్స్ట్ మల్లి ఒక మాస్ సినిమా చేయాలనీ అనుకుంటున్నారు దాని కోసం పూరి ని ఒక కథ రెడీ చేయమన్నారు అని తెలుస్తుంది అయితే పూరి దగ్గర చిరంజీవి కి సరిపడా స్టోరీ ఆల్రెడీ రెడీ గా ఉందని తొందర్లోనే చిరుకి చెప్పబోతున్నట్టు తెలుస్తుంది ఈ స్టోరీ లో చిరు ఇండియాని షేక్ చేసే డాన్ పాత్రలో కనిపిస్తారని కూడా తెలుస్తుంది... ఇది ఇలా ఉంటె ప్రస్తుతం ఫామ్ లో లేని పూరి కి అవకాశం ఇచ్చి చిరంజీవి రిస్క్ చేస్తున్నాడు అని కొందరు అభిప్రాయ పడుతుంటే ఇంకొందరు మాత్రం పూరి కి ఫామ్ అవసరం లేదు తను తీయాలి అనుకుంటే ఇప్పటికి బ్లాక్ బస్టర్ తీసే సత్తా పూరి కి ఉంది కాబట్టే చిరంజీవి చాలా నమ్మకం తో పూరి కి అవకాశం ఇస్తున్నట్ట్టు చెబుతున్నారు...నిజానికి పూరి తలుచుకుంటే ఒక మంచి మాస్ సినిమా తీయగలడు కానీ ఎందుకు ఆయన సినిమా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టడం లేదో తెలియట్లేదు చిరంజీవి సినిమా చేస్తే మాత్రం పూరి మంచి హిట్ సినిమా తీస్తాడనే విషయం అయితే తెలుస్తుంది ఎందుకంటే చిరంజీవి సినిమా తనకి చాలా ప్రస్టేజ్ కి సంభందించింది కాబట్టి ఈ సినిమా విషయంలో కొంచం ఎక్కువ కేర్ తీసుకుంటాడని తెలుస్తుంది.చూడాలి మరి చిరంజీవి పూరి సినిమా అఫీషయల్ గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: