ఇండియన్-2 తో సిద్ధార్థ్ కు కలిసొచ్చేనా..?

Divya
తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రాలలో ఇండియన్-2 సినిమా కూడా ఒకటి సినిమా కోసం ప్రేక్షకులు ఎం
తో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో హీరో కమలహాసన్ తన వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నారు. గతంలో విడుదలైన భారతీయుడు సినిమాకి ఈ చిత్రం అన్నట్లుగా తెలుస్తోంది. సౌత్ తో పాటు నార్త్ లో కూడా ఈ సినిమా పైన మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతూ ఉండగా ఈ చిత్రానికి సంబంధించి అప్డేట్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి ఈ చిత్రంలో మరొక నటుడు హీరో సిద్ధార్థ కూడా నటించబోతున్నట్లు చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్రలో సిద్ధార్థ్ నటిస్తున్నారని ఈమెరకు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక కొత్త పోస్టర్ను కూడా అనౌన్స్మెంట్ చేశారు. చార్మింగ్ యాక్టర్ గా పేరు పొందిన సిద్ధార్థ్ ఈ సినిమాలో ఎలాంటి పాత్ర కనిపించబోతున్నాడు అంటూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.
ఇండియన్ టు లో హీరోయిన్లుగా కాజల్ అగర్వాల్ నటిస్తూ ఉండగా కీలకమైన పాత్రల రకుల్ ప్రీతిసింగ్ కూడా నటిస్తోంది. మరొక హీరోయిన్ ప్రియా భవాని శంకర్ సముద్రఖని భావిసింహ తదితరులు ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్ ఈ సినిమాని భారీ బడ్జెట్లో ప్రొడ్యూస్ చేయడం జరుగుతొంది.. అనిరుద్ రవి చందర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తూ ఉన్నారు. ఈ సినిమా విడుదల తేదీ పై అందరూ కూడా చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఏదిఏమైనా నటుడు సిద్ధార్థ్ ఎలాంటి పాత్రలో నటించి మెప్పిస్తారు అంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: