ప్రస్తుతం బాగా ట్రోల్స్ కి గురి అవుతున్న ఆ డైరెక్టర్....!!

murali krishna
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఎనిమిది సంవత్సరాల తర్వాత శాకుంతలం చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

8 సంవత్సరాల క్రితం రుద్రమ దేవి చిత్రం తో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అన్నట్లుగా నిలిచింది. అనుష్క క్రేజ్ వల్ల ఆ సమయం లో భారీగానే కలెక్షన్స్ నమోదయ్యాయి. కానీ శాకుంతలం సినిమా అలా కాదు. సమంత కి ఉన్న క్రేజ్ కూడా కలెక్షన్స్ ని తెచ్చి పెట్టలేక పోయింది. సినిమా లోని నాసిరకపు గ్రాఫిక్స్ వల్ల ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. రాజమౌళి సినిమా లోని గ్రాఫిక్స్ చూసిన తర్వాత తెలుగు ప్రేక్షకులు ఇలాంటి నాసిరకం గ్రాఫిక్స్ ని పట్టించుకోవడం లేదు. 

బ్రహ్మాస్త్ర సినిమా లోని గ్రాఫిక్స్ ని తెలుగు ప్రేక్షకులు అమీర్ పేట్ గ్రాఫిక్స్ అంటూ ఎద్దేవా చేశారు. అలాంటిది శాకుంతలం లో నాసిరకం గ్రాఫిక్స్ ని చూసి మరింతగా ట్రోల్స్ చేస్తున్నారు. అందుకే దర్శకుడు గుణశేఖర్ పై ఇప్పుడూ ట్రోల్స్ వస్తున్నాయి.గ్రాఫిక్స్ జోలికి పోకుండా గతంలో ఆయన తెరకెక్కించిన ఒక్కడు లాంటి సినిమాలను చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఎన్నో అద్భుతమైన సినిమాలను చేసిన దర్శకుడు గుణశేఖర్ ఇతర దర్శకులతో పోటీ పడేందుకు ప్రయత్నించే క్రమంలో గ్రాఫిక్స్ సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాడు. ఆయన ఎంపిక తప్పు అని రుద్రమదేవి తో నిరూపికమైంది. తాజాగా విడుదలైన శాకుంతలం సినిమా కూడా అదే నిరూపించింది. కనుక ముందు ముందు అయినా దర్శకుడు గుణశేఖర్ గ్రాఫిక్స్ సినిమాలకు దూరంగా ఉంటే బాగుంటుంది అని అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. శాకుంతల సినిమా తో దర్శకుడు శేఖర్ గుణపాఠం నేర్చుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. మరి గుణశేఖర్ తదుపరి సినిమా ఎలా ఉంటుందో చూడాలంటే మరి కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: