దానిపై క్లారిటీ ఇచ్చిన ఉపాసన...!!

murali krishna
ప్రస్తుతం ఉపాసన పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగుతుందనే సంగతి తెలిసిందే. ఉపాసన ఏ పని చేసినా అందుకు సంబంధించిన వార్త క్షణాల్లో వైరల్ అవుతోంది.

అయితే ఉపాసన బేబీ బంప్ కనిపించకపోవడం గురించి సోషల్ మీడియా లో వేర్వేరు వార్తలు ప్రచారంలో కి వస్తున్నాయి. ఈ వార్తల గురించి ఉపాసన స్పందిస్తూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రెగ్నెన్సీ ఒక వేడుక లా ఉండాలని నేను కోరుకుంటానని ఆమె అన్నారు. 

ప్రస్తుతం ఈ ప్రయాణాన్ని నేను ఆస్వాదిస్తున్నానని ఉపాసన తెలిపారు. ఈ రీజన్ వల్లే ఎలాంటి ఇబ్బంది పడకుండా ప్రపంచ దేశాలను చుట్టి వచ్చానని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. నేను ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఆ ఆహారంలో ఎలాంటి పోషకాలు ఉండా లో డాక్టర్ సలహాలు ఇచ్చాడని ఉపాసన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నేను నార్మల్ దుస్తులలో నే ఫిట్ గా ఉన్నానని ఉపాసన కామెంట్లు చేశారు. ఈ రీజన్ వల్లే నేను మెటర్నిటీ క్లాత్స్ ను ధరించడం లేదని సాధారణ దుస్తుల లో కనిపించడాన్ని నేను గొప్ప గా భావిస్తున్నానని ఆమె తెలిపారు. ఈ రీజన్ వల్లే బేబీ బంప్ లుక్ కనిపించడం లేదని ఉపాసన పేర్కొన్నారు. నిజానికి ఇది జీవితాని కి గొప్ప ప్రయాణం అని ఉపాసన అభిప్రాయపడ్డారు. ఉపాసన తన ప్రెగ్నెన్సీ కి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. మరోవైపు చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూట్ లో పాల్గొంటూ శరవేగంగా ఈ సినిమాను పూర్తి చేస్తున్నారు. రామ్ చరణ్ పారితోషికం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా చరణ్ డ్యుయల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. చరణ్ కు జోడీగా ఈ సినిమాలో కియారా అద్వానీ నటిస్తున్నారు. ఉపాసనకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: