నెట్టింటా వైరల్ అవుతున్న NTR30 మూవీ అప్డేట్....!!

murali krishna
యంగ్ టైగర్ ఎన్టీఆర్  టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ ''NTR30''.
అగ్ర దర్శకుల మధ్య ఈ మధ్యనే గ్రాండ్ లాంచింగ్ చేసుకున్న ఈ సినిమా ఆ తర్వాత కొన్నాళ్లకే రెగ్యురల్ షూట్ కూడా స్టార్ట్ అయ్యింది.. అయితే తారక్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూనే ఉన్నారు.
కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా చాలా రోజుల పాటు షూట్ స్టార్ట్ అవ్వలేదు.. ఎట్టకేలకు లాంచ్ అవ్వడమే కాకుండా వెంటనే షూట్ కూడా స్టార్ట్ అవ్వడంతో ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు.. ఇదిలా ఉండగా ఈ పాన్ ఇండియన్ సినిమా నుండి ఏదొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వస్తూనే ఉంది. తాజాగా మరో అప్డేట్ నెట్టింట వైరల్ అవుతుంది.
ఈ సినిమాలో ఎన్టీఆర్ ను ఢీ కొట్టబోయే విలన్ ఎవరు అని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది.కానీ ఇప్పటి వరకు ఈ సినిమాలో ఎవర్ని విలన్ గా ఫిక్స్ చేయలేదు. సైఫ్ అలీ ఖాన్ పేరు వినిపించిన ఇప్పటికి ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఈసారి ఎన్టీఆర్ సినిమా నుండి వచ్చిన పుకార్లు నెట్టింట వైరల్ అవుతున్నారు. ఈ సినిమాలో విలన్స్ అందరిలో కల్లా పెద్ద విలన్ ఎన్టీఆరేనట. మంచి వాడు న్యాయం కోసం చేసే యుద్ధం కన్నా చెడ్డ వాడు అన్యాయంపై చేసే యుద్ధమే ఎంతో గొప్పది అనే కోణంలో ఈ సినిమా సాగుతుంది.. అందరి కన్నా చెడ్డవాడు అన్యాయాన్ని ఎలా అంతం చేసాడు అనే కథాంశంతో ఈ కథ సాగుతుంది.
ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై నిర్మిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే 2024 ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ ఉంటుంది అని ఇప్పటికే అఫిషియల్ గా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: