అఖిల్ "ఏజెంట్" మూవీ రన్ టైమ్ లాక్..!

Pulgam Srinivas
అక్కినేని అఖిల్ ఆఖరుగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ యువ హీరో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఏజెంట్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఇది ఇలా ఉండే సురేందర్ రెడ్డి ఆఖరుగా భారీ బడ్జెట్ తో రూపొందినటువంటి సైరా నరసింహా రెడ్డి అనే పాన్ ఇండియా మూవీ కి దర్శకత్వం వహించాడు.

ఈ సినిమాలో చిరంజీవి హీరోగా నటించగా ... నయనతార ... తమన్నా ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించారు. ఇది ఇలా ఉంటే ఏజెంట్ మూవీ లో అఖిల్ సరసన సాక్ష్య వైద్య హీరోయిన్ గా నటించగా ... ఈ మూవీ కి హిప్ హప్ తమిజ సంగీతం అందించాడు. మమ్ముట్టి ఈ మూవీ లో కీలక పాత్రలో నటించగా ... ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 28 వ తేదీన థియేటర్ లలో తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ లను ఫుల్ స్పీడ్ లో నిర్వహిస్తోంది.

ఇది  ఇల్ ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ సినిమా యొక్క రన్ టైమ్ ను ఈ మూవీ యూనిట్ తాజాగా లాక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని 2 గంటల 30 నిమిషాలు నిడివితో ఈ చిత్ర బృందం ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇలా ఉంటే ఈ మూవీ పై ప్రస్తుతం ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: