ఆరోజు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించనున్న వీర సింహారెడ్డి మూవీ..!

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ ఆఖరు గా వీర సింహా రెడ్డి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటి శృతి హాసన్ ... బాలయ్య సరసన హీరోయిన్ గా నటించగా ... మరో కీలకమైన పాత్రలో హాని రోజ్ ఈ సినిమాలో నటించింది. టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి దర్శకుడుగా గుర్తింపును తెచ్చుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రి సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించగా ... తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. వరలక్ష్మి శరత్ ... కుమార్ దునియా విజయ్ ఈ మూవీ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు.
 

ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ మూవీ లో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇది ఇలా ఉంటే థియేటర్ లలో భారీ విజయం అందుకున్న ఈ సినిమా మరి కొన్ని రోజుల్లోనే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెర ప్రేక్షకులను అలరించబోతోంది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ దక్కించుకుంది.

అందులో భాగంగా ఈ సినిమాను ఏప్రిల్ 23 వ తేదీన సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు స్టార్ మా చానల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రచారం చేయనున్నట్లు తాజాగా స్టార్ మా సంస్థ అధికారికంగా ప్రకటించింది. మరి ఇప్పటికే థియేటర్ లలో ప్రేక్షకులను ఎంత గానో అలరించిన ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: