పవన్ కళ్యాణ్ ... సుధీర్ వర్మ మూవీపై లేటెస్ట్ న్యూస్..?

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల క్రితం హరిహర వీరమల్లు అనే భారీ బడ్జెట్ ఇండియా మూవీ ని ఓకే చేసిన విషయం మనకు తెలిసింది. ఈ మూవీ షూటింగ్ కొంత భాగం పూర్తి అయిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని రోజుల పాటు ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఈ మూవీ షూటింగ్ ను ప్రారంభించారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తయింది. ఈ మూవీ షూటింగ్ ను అతి త్వరలోనే పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది.

కొన్ని రోజుల క్రితమే పవన్ తమిళ సినిమా వినోదయ సీతం కు రీమేక్ గా రూపొందిన సినిమాలో తన షూటింగ్ భాగాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ మూవీ ని జూలై మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నారు. కొన్ని రోజుల క్రితమే పవన్ ... హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ షూటింగ్ ను ప్రారంభించాడు. ఈ మూవీ యొక్క మొదటి షెడ్యూల్ షూటింగ్ తాజాగా పూర్తి అయింది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తోంది. నవంబర్ వరకు ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేసే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది.

పవన్ ... సుజిత్ దర్శకత్వంలో "ఓజి" అనే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ రేపటి నుండి ప్రారంభం కానుంది. ఈ మూవీ షూటింగ్ ను కూడా నవంబర్ వరకు పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా పవన్ ప్రస్తుతం కమిట్ అయిన సినిమాల షూటింగ్ లను నవంబర్ వరకు పూర్తి చేయబోతున్నట్లు ... ఆ తర్వాత పవన్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: