కీర్తి సురేష్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదేనా..?

Divya
మహానటి కీర్తిసురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె తన సొంత తెలివితోనే మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. మహానటి సావిత్రి బయోపిక్ లో మహానటి సినిమాలో నటించి నేషనల్ అవార్డును సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. గత కొన్ని రోజులుగా సినిమాలలో అలరిస్తూ మెప్పిస్తోంది.  పద్ధతికి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న కీర్తి సురేష్ ఇప్పుడు మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో పూర్తిగా తన లుక్ మార్చేసింది.  ఎవరూ ఊహించని విధంగా అందులో గ్లామర్ షో చేసింది.  ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల గ్లామర్ ఫోటో షూట్ లతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఈ  ముద్దుగుమ్మ.
ఇదిలా ఉండగా కీర్తి సురేష్ వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఎప్పుడు వివాహం చేసుకుంటుంది అంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కీర్తి సురేష్ పెళ్లి గురించి ప్రశ్న ఎదురవడంతో ఈమె ఇచ్చిన జవాబు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు విషయంలోకి వెళితే.. ఇటీవలే దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఫాలోవర్స్ తో సరదాగా ముచ్చట్లు పెట్టింది. పెళ్లి గురించి అడిగిన ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానం తెలిపింది.
ఇందులో భాగంగానే ఒక నెటిజన్ పెళ్లి గురించి అడగడంతో.. కీర్తి సురేష్ ఏమీ చెప్పకుండా ఒక ఎమోజిని పంచుకుంది. అందులో జేబులు ఖాళీ అన్నట్లు ఉండడంతో ఈ స్టోరీ చూసి పెళ్లి చేసుకోవడానికి కీర్తి సురేష్ దగ్గర డబ్బులు లేవా అంటూ చాలామంది రకరకాలుగా ఆలోచిస్తున్నారు. కీర్తి సురేష్ ఎమోజిని ఏ ఉద్దేశంతో పంచుకుందో అనేది అర్థం కాక రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా కీర్తి సురేష్ పెళ్లి చేసుకోక పోవడానికి కారణం డబ్బు అని ప్రతి ఒక్కరూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: