టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మరొక మల్టీస్టారర్ మూవీ..!!

Divya
టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ మూవీలు చాలా తక్కువగానే విడుదలవుతుంటాయి.RRR చిత్రంలో అగ్ర హీరోలు ఎన్టీఆర్ ,రామ్ చరణ్ నటించినప్పటి నుంచి మరి కొంతమంది నటీనటులు సైతం మల్టీ స్టారర్ చిత్రాల వైపు కాస్త మక్కువ చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఇలా ఉంటే తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్త ప్రకారం నందమూరి ఎన్టీఆర్, అల్లు అర్జున్ కలిసి ఒక బడా మల్టీ స్టార్ మూవీ కి రంగం సిద్ధం చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
మరొకసారి మెగా ,నందమూరి కాంబినేషన్ రిపీట్ కాబోతున్నట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ ఆదిత్య దార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కోసం అల్లు అర్జున్, ఎన్టీఆర్ తీసుకోవాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే పారాణిక నేపథ్యంలో అశ్వద్ధామ అనే చిత్రాన్ని రూపొందించేందుకు పలు ప్రణాళికలు కూడా జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే వీరిద్దరూ అయితే బాగుంటుంది అని డైరెక్టర్ ఆదిత్య భావిస్తున్నట్లుగా సమాచారం.
ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. అందుకు సంబంధించి పనులు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంపై.. ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఎలా స్పందిస్తారో అంటూ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయంపై త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలుపడే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే మొదట ఈ సినిమా కథ కోసం బాలీవుడ్ నటులు విక్కీ కౌశల్, రణవీర్ సింగ్ పేర్లు పరిశీలించినట్లు తెలుస్తోంది కానీ దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ కూడా రాలేదు తాజాగా తెరపైకి టాలీవుడ్ యంగ్ హీరోల పేర్లు వినిపించడంతో అభిమానులు తెగ సంబరపడుతున్నారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2 సినిమాల బిజీగా ఉన్నారు ఎన్టీఆర్ కూడా తన 30వ సినిమా షూటింగ్ డైరెక్టర్ కొరటాల శివ తో మొదలుపెట్టడం జరిగింది. మరి ఎన్టీఆర్ అల్లు అర్జున్ మల్టీస్టారర్ చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: