మెగాస్టార్ అభిమానులు టెన్షన్ పడటానికి కారణం...!!

murali krishna
మెగాస్టార్ చిరంజీవి కి చాలా సంవత్సరాల తర్వాత వాల్తేరు వీరయ్య సినిమా రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మించి మెప్పించింది.
చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో నటిస్తుండగా మెహర్ రమేష్ ఈ సినిమాకు దర్శకుడు కావడంతో చిరంజీవి అభిమానులు ఒకింత టెన్షన్ పడుతున్నారనే సంగతి తెలిసిందే.
భోళా శంకర్ సినిమా కు అనిల్ సుంకర నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా వేదాళం సినిమాకు రీమేక్ కాగా మెహర్ రమేష్ ట్రాక్ రికార్డ్ ను దృష్టిలో ఉంచుకుని లిమిటెడ్ బడ్జెట్ తో నిర్మించాలని ఆయన భావించారు. ఆగష్టు నెల 11వ తేదీన ఈ సినిమా థియేటర్ల లో విడుదల కానుంది. అయితే ఈ సినిమా బడ్జెట్ శృతి మించుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వాల్తేరు వీరయ్య సక్సెస్ తో భోళా శంకర్ కు మంచి ఆఫర్లు వస్తున్నాయి.
అయితే బడ్జెట్ విషయంలో పొరపాట్లు జరగకుండా ఉంటే మాత్రమే కళ్లు చెదిరే స్థాయిలో లాభాలు సొంతమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనిల్ సుంకర కు ఈ సినిమా ఏ స్థాయిలో లాభాలను అందిస్తుందో చూడాల్సి ఉంది. అనిల్ సుంకర నిర్మాత గా తెరకెక్కిన ఏజెంట్ మూవీ ఈ నెల చివరి వారం లో థియేటర్లలో విడుదల కానుంది.
అనిల్ సుంకర నిర్మాత గా వరుస విజయాలు అందుకోవాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అనిల్ సుంకర ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఇకనైనా జాగ్రత్త పడాలి. మెహర్ రమేష్ ఈ సినిమాతో సర్ప్రైజ్ ఇస్తారో లేక షాక్ ఇస్తారో చూడాలి. మెగాస్టార్ చిరంజీవి రెమ్యునరేషన్ కూడా భారీ రేంజ్ లోనే ఉందని సమాచారం అందుతోంది. ప్రాజెక్ట్ ల ఎంపికలో, దర్శకుల ఎంపికలో చిరంజీవి మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: