నిర్మాతల పాలిట శాపంగా మారిన డైరెక్టర్...!!

murali krishna
శాకుంతలం సినిమా చూడగానే ఒక్కసారిగా రుద్రమ దేవి సినిమా గుర్తుకు వచ్చింది. దిల్ రాజు లాంటి నిర్మాత చేయి పెట్టాడు అంటే అందులో విషయం ఉండి ఉంటుంది అని భావించే ఒక రకం ప్రేక్షకులు ఉన్నారు.
మరి శాకుంతలం మరో రుద్రమదేవి అని ఒక్క షో తోనే తేలిపోయింది. రుద్రమదేవి సినిమా లో ఒక్క గోన గన్నారెడ్డి ఎపిసోడ్ మినహా ఏముంది సినిమాలో ఇప్పటికి అర్ధం కానీ ప్రశ్న, ఇప్పుడు కూడా అల్లు అర్జున్ కూతురు అర్హ లేకపోతే సినిమా ఫ్రీ గా చూపించిన ఎవరు చూడరు. మరి పౌరాణిక సినిమాలు తీసి జనాలను ఇంత కక్ష సాదించాలా గుణశేఖరా అంటూ సోషల్ మీడియాలో చాల సెటైర్స్ వినిపిస్తున్నాయి.
గుణశేఖర్ కెరీర్ లో మంచి మాస్ కమర్షియల్ సినిమాలు రెండే రెండు. ఒకటి చూడాలని వుంది మరొకరు ఒక్కడు. అయన తీసిన మరొక పౌరాణిక చిత్రం బాల రామాయణం. అందులో ఎన్టీఆర్ మనవడు రాముడిగా ఉన్నాడు కాబట్టి చూడగలిగాం. మరోవైపు అభిరుచి ఉన్న నిర్మాత ఎం ఎస్ రెడ్డి ప్రొడక్షన్ కాబట్టి జనాల్లో మంచి ఆసక్తిని సృష్టించింది. చాలా భీకరంగా పెద్ద పెద్ద సెట్టింగ్ లు వేసి తీసిన నిర్మాతలు ఎవరు కూడా గుణశేఖర్ కోసం మరొక సినిమాకు డబ్బులు పెట్టలేదు. వరుడు సినిమా తీసి దానయ్యను నిండా ముంచారు. ఇక మృగరాజు చిత్రం తో దేవి వర ప్రసాద్ కొంప ముంచారు. మహేష్ బాబు అన్న రమేష్ బాబు ని అర్జున్ సినిమాతో బయపెట్టేసాడు. సైనికుడు సినిమాతో అశ్విని దత్ ని వెనక్కి తిరిగి చూడకుండా చేసారు. ఒక్కడు వంటి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన కూడా ఎం ఎస్ రాజు గారు మరో సినిమాకు దర్శకుడిగా గుణశేఖర్ ని పెట్టుకోలేదు. ఇలా నిర్మాతల పాలిట శాపంగా మారుతున్నాడు. గుణశేఖర్ కెరీర్ మొత్తంలో తీసినవి 13 సినిమాలు మాత్రమే. 1992 నుంచి దర్శకత్వం చేస్తున్న ఈ 31 ఏళ్లలో ఇంత తక్కువ సినిమాలు ఎందుకు తీశారో అర్ధం చేసుకోవచ్చు. పైగా ఒక్కడు వంటి బిగ్ హిట్ ఇచ్చాడు అనే ఒకే ఒక్క కారణంతో మహేష్ బాబు గుణశేఖర్ కి మరో రెండు సినిమాలు చేసాడు. సైనికుడు మరియు అర్జున్. ఇకనైన పౌరాణిక కథలు తగ్గించి ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కొంచం తగ్గిస్తే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: