ఆ విషయం గూర్చి సడన్ సర్ ప్రైజ్ ఇవ్వనున్న స్టార్ యాంకర్....!!

murali krishna
తెలుగు లో ఉన్న కొద్దిమంది మెల్ యాంకర్స్ లో ప్రదీప్ మాచిరాజు ఒక్కరు.ఆయన యాంకర్ అయిన కొద్దీ రోజుల్లోనే స్టార్ యాంకర్ గా ఎదిగారు.
ముఖ్యంగా కెరియర్ మొదట్లో లేడీస్ షో లు చేసి బాగా పాపులర్ అయ్యారు. ప్రదీప్ ప్రస్తుతం ఉన్న యాంకర్స్ లో తనే టాప్ యాంకర్ గా ఉన్నారు.బుల్లి తెరమీదే కాకుండా, వెండి తెర మీద కూడా ప్రదీప్ తన సత్తా చాటారు అనే చెప్పాలి. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరో గా పరిచయం అయ్యారు ఈ సినిమా హిట్ అయింది అయిన కూడా ప్రదీప్ ఇంకో సినిమా చేయలేదు, చాలా రోజుల నుంచి సినిమాలకి దూరం గా ఉంటూ షో లు మాత్రమే చేస్తున్నాడు.
ప్రదీప్ యాంకరింగ్ గురించి చెప్పాలంటే చాలా ఉత్సాహంగా అందరితో నాన్ స్టాప్ గా మాట్లాడుతూ చాలా ఎనర్జిటిక్ గా ఉంటాడు. ముఖ్యంగా ఢీషో లో ఆయన చేసే కామెడీ అయితే సూపర్ గా ఉంటుంది ఆ షో లో హైపర్ ఆది ప్రదీప్ కాంబినేషన్ లో ఫుల్ ఫన్ ఉంటుంది. ఢీషో సూపర్ సక్సెస్ కావడం లో ప్రదీప్ పాత్ర కూడా చాలానే ఉంది. ప్రస్తుతం యాంకర్ గా తను కెరియర్ లో టాప్ పొజిషన్ లో ఉన్న కూడా ప్రదీప్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఈయన పెళ్లి గురించి అప్పట్లో ఒక ప్రముఖ ఛానల్ వాళ్ళు ఒక షోని కూడా నిర్వహించారు, కానీ ఆ షో చాలా విమర్శలని ఎదురుకుంది.దాంతో ఆ షోని అర్థాంతరంగా తీసివేశారు. ఇది ఇలా ఉంటె ఇప్పుడు ఒక వార్త హల్చల్ చేస్తుంది ప్రదీప్ గత కొంత కాలంగా ఒక అమ్మాయి ని డీప్ గా లవ్ చేస్తున్నట్టు గా కూడా తెలుస్తుంది.అయితే ప్రదీప్ వల్ల ఇంట్లో కూడా వీళ్ళ లవ్ మాటర్ తెలుసని వల్ల అమ్మ నాన్న కూడా వీళ్ళ పెళ్లి కి ఒప్పుకున్నారని అంటున్నారు. అయితే ప్రేక్షకులు అందరికీ ఒక సడన్ సర్ ప్రైజ్ లాగా చెప్పాలి అని ప్రదీప్ చూస్తున్నట్టు గా తెలుస్తుంది.అయితే ఈ విషయం నిజమా లేదా అనే విషయం.తెలియాలి అంటే ఇంకా కొన్ని రోజులు ఆగాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: