ఆ ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలతో మల్టీ స్టార్ ప్లాన్ చేస్తున్న దిల్ రాజు..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న ప్రొడ్యూసర్ లలో దిల్ రాజు ఒకరు. ఈయన సినిమా ఇండస్ట్రీ లో కెరియర్ ను డిస్ట్రిబ్యూటర్ గా మొదలు పెట్టి ... ఆ తర్వాత నిర్మాతగా అనేక సినిమాలను నిర్మించి ... ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ నిర్మాతల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. అలాగే ఇప్పటికి కూడా దిల్ రాజు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ వస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం దిల్ రాజు ... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ కి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఎస్ జే సూర్య విలన్ పాత్రలో నటిస్తున్న ఈ మూవీ లో కీయర అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ...  అంజలి , సునీల్ , శ్రీకాంత్ ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ మూవీ దిల్ రాజు బ్యానర్ లో 50 వ మూవీ గా రూపొందుతోంది.

రామ్ చరణ్ ... శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం దిల్ రాజు ఒక అదిరిపోయే మల్టీ స్టారర్ మూవీ ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న స్టార్ హీరోలు అయినటు వంటి మెగాస్టార్ చిరంజీవి ... నందమూరి నరసింహ బాలకృష్ణ లపై దిల్ రాజు ఒక భారీ మల్టీ స్టారర్ మూవీ ని ప్లాన్ చేస్తున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో దిల్ రాజు ... వెంకటేష్ ... మహేష్ లతో కలిసి సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు అనే మల్టీస్టారర్ మూవీ ని రూపొందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: