నయనతార డ్రీమ్ ఇప్పటికైనా నెరవేరేనా..?

Divya
ప్రతి నటీనటుడికి కచ్చితంగా ఏదో ఒక డ్రీమ్ అనేది ఉండనే ఉంటుంది.. అలాగే తమ డ్రీమ్ రోల్ తమ ఫేవరెట్ డైరెక్టర్ దర్శకత్వంలో నటించాలని కోరిక కూడా ఉంటుంది. ఎంతటి వారి కైనా సరే ఇలాంటి కోరిక ఉండనే ఉంటుంది. తాజాగా లేడీ సూపర్ స్టార్ గా పేరుపొందిన నయనతార కూడా ఒక దర్శకుడు తో పని చేయాలని చాలా కాలంగా కోరికగా ఉందట. ఆదర్శకుడు ఎవరు ఆ కోరిక నెరవేరే సమయం వచ్చిందా లేదా అనే విషయంపై ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

నయనతార డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం లో ఖచ్చితంగా ఒక సినిమాలో నైనా నటించాలని కోరిక ఉందట. ఇటీవల ఒక అవార్డు వేడుకలలో పాల్గొన్న సందర్భంగా నయనతార ఈ విషయాలను మళ్లీ తెలియజేసింది.. అవార్డు కార్యక్రమంలో భాగంగా మణిరత్నం చేతులమీదుగా నయనతార అవార్డును సొంతం చేసుకుంది. అవార్డు అందుకోవడానికి ముందు నయనతార డైరెక్టర్ మణిరత్నం కాళ్లకు నమస్కారం పెట్టగా ఆయన నయనతారను ఆశీర్వదించారు. అంతేకాకుండా ఈ వేదిక నుంచి తన కోరిక గురించి కూడా నయనతార తెలియజేసింది.

మణిరత్నం ముందే ఆయన దర్శకత్వంలో నటించాలని ఉందంటూ తన కోరికను బయట పెట్టడంతో త్వరలోనే ఆమెకుల నెరవేరే అవకాశాలు ఉన్నాయని తమిళ మీడియా నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం మణిరత్నం కమలహాసన్ తో ఒక సినిమాని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా లో కమలహాసన్ కు జోడిగా నయనతార ఎంపిక చేయబోతున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. హిందీలో డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కిస్తున్న జవాన్ చిత్రంలో ఈమె హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ నిలేష్ కృష్ణ దర్శకత్వంలో మరొక సినిమాలు నటిస్తోంది నయనతార ఈ సినిమాలే కాకుండా పలు చిత్రాలలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈసారైనా నయనతార కల నెరవేరుతుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: