మెహందీ ఫోటోలతో షాక్ ఇచ్చిన హీరోయిన్ అంజలి..!!

Divya
టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్ గా పేరు పొందింది హీరోయిన్ అంజలి. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపించి అలరించిన ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళంలో కూడా వరుస ఆఫర్లను అందుకుంటు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది .విభిన్నమైన పాత్రలలో కూడా నటిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గానే ఉంటూ తన వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా కొన్ని ఫోటోలను ఈ అమ్మడు పంచుకోవడం జరిగింది.
అయితే ఇందులో అంజలి మెహందీ పెట్టుకుని చేతులను ఫాన్స్ చూపిస్తూ ఫోటోలను షేర్ చేయడం జరిగింది .ఈ ఫోటోలు చూసిన అభిమానులు పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు.. అయితే ఈ రోజు తమిళ కొత్త సంవత్సరం కావడంతో అంజలి ఇలా ఫోటోలను షేర్ చేసింది అంటూ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం తమిళంలో పలు సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉంటోంది అంజలి.. తమిళ ప్రేక్షకులకు తమ అభిమానులకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఫోటోలను షేర్ చేయడం జరిగింది. తాజాగా ఫోటోలతో అంజలి వైట్ టాప్ తో దర్శనమిచ్చింది.
ఈ ఫోటోలకు ఈ ముద్దుగుమ్మ కొంటెగా ఫోజులిస్తూ చేతులు చూపించడంతో పాటు ఫ్యాన్స్ నీ ఆకట్టుకుంది ఈమె అందాన్ని కూడా పొగుడుతూ పలు రకాలుగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.చివరిగా నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమాల స్పెషల్ డాన్స్ తో ఆకట్టుకుంది.ఈ ముద్దుగుమ్మ ఈ పాట హిట్ అవ్వడంతో అంజలి క్రేజీ కూడా బాగానే పెరిగిపోయింది. తమిళంలో తాజాగా ఝాన్సీ అనే వెబ్ సిరీస్లో నటించింది ప్రస్తుతం మరొక వెబ్ సిరీస్ లో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. RC -15 సినిమా షూటింగ్లో కీలకమైన పాత్రలో నటిస్తోంది అంజలి ఈ సినిమాకి సంబంధించి పలు లీక్ అయిన ఫోటోలు కూడా వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: