సమంత అంచనాలను తల క్రిందులు చేసిన శాకుంతలం !

Seetha Sailaja
కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఒక మహా కావ్యం. దీనిని ఆధారంగా చేసుకుని ఈతరం వారికి ఆ పౌరాణిక గాధను తెలియచేయాలని విజువల్ వండర్ గా మార్చి గుణశేఖర్ చేసిన ప్రయత్నాలకు సగటు ప్రేక్షకుడి నుండి ఆశించిన స్పందన రాలేదు అన్న వార్తలు వస్తున్నాయి. ఈమూవీ చాల స్లోగా ఉండటంతో ప్రేక్షకులు కోరుకున్న ఎమోషనల్ టచ్ లోపించడంతో ‘శాకుంతలం’ మూవీ ఊహించిన స్థాయిలో విజయాన్ని అందుకోవడం కష్టం అన్న సంకేతాలు వస్తున్నాయి.

ఒక పౌరాణిక ప్రేమ క‌థ‌ను విజువ‌ల్ వండ‌ర్‌గా తీసి త్రీడీ మాయాజాలంతో జనాన్ని ఆకట్టుకోవాలని చేసిన ప్రయత్నాలు మంచిదే అయినప్పటికీ ఆ ప్రయత్నాలను సఫలీకృతం చేయడంలో గుణశేఖర్ నేటితరం ప్రేక్షకులకు అభిరుచికి తగ్గట్టుగా ఈసినిమాను తీయలేకపోయాడు అన్న కామెంట్స్ కొందరు చేస్తున్నారు. వాస్తవానికి ఇలాంటి ప్రాజెక్ట్ ను ఇప్పుడు తీయడం ఒక సాహసం.

మొదట్లో ఈమూవీని 40 కోట్ల బడ్జెట్ తో తీయాలి అని భావించి మొదలుపెట్టిన తరువాత గుణశేఖర్ ఎక్కడా రాజీ పడకుండా ఈమూవీ పై పెట్టుబడి 65 కోట్లకు చేరువైంది అని అంటున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ఈమూవీకి సహ నిర్మాతగా వ్యవహరించి విడుదల చేసినప్పటికీ ఈమూవీ బిజినెస్ అనుకున్న స్థాయిలో జరగక పోవడంతో సుమారు 20 కోట్ల లోటుతో విడుదల అయింది అంటున్నారు.

ఈమూవీకి ప్రస్తుతం వచ్చిన టాక్ రీత్యా గుణశేఖర్ దిల్ రాజ్ లు పెట్టిన పెట్టుబడి తిరిగి రావడం కష్టం అన్న అంచనాలు వస్తున్నాయి. సమంత కెరియర్ కు అత్యంత కీలకంగా మారిన ఈమూవీకి వచ్చిన ఫలితం సమంతను కూడ నిరాశపరిచే ఆస్కారం కనిపిస్తోంది. సెల్ ఫాన్స్ సోషల్ మీడియాల మధ్య నిరంతరం బిజీగా ఉంటున్న నేటితరం ప్రేక్షకులు ఈ ఉదాత్తమైన ప్రేమ కావ్యాన్ని ఎంతవరకు ఆదరిస్తారు అన్న సందేహాలు ఈమూవీకి వచ్చిన టాక్ ను బట్టి అర్థం అవుతోంది. ఏమైనా గుణశేఖర్ సమంతల కష్టానికి తగ్గ ఫలితం ఏమిటి అన్నది వేచి చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: