గతాన్ని తలుచుకొని.. కన్నీరు పెట్టుకున్న మనోజ్ భార్య మౌనిక?

praveen
ఇటీవల కాలంలో మంచు వారి వారసుడు మనోజ్ ఇక భూమా మౌనిక రెడ్డిని రెండో వివాహం చేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. వీరి వివాహం అటు అతిథుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది అని మాత్రమే అందరికీ తెలుసు. కానీ వివాహం జరగడానికి ముందు ఇక వీరి జీవితంలో ఎన్నో అనూహ్యమైన ఘటనలు చేసుకున్నాయని మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. చాలా ఆటంకాలు మానసిక ఒత్తిడి వంటివి అధిగమించి ఫైనల్ గా పెద్దలను ఒప్పించి ఇద్దరు కూడా వివాహ బంధంతో ఒకటయ్యారు అని చెప్పాలి.

 ఇకపోతే ఇటీవల వెన్నెల కిషోర్ హోస్టింగ్ చేస్తున్న ఒక కార్యక్రమంలో మనోజ్ మౌనిక దంపతులు పాల్గొన్నారు. వీరి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది అని చెప్పాలి. టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్నది వెన్నెల కిషోర్ కి దాదాపు అందరు హీరోల ఫ్యామిలీస్ తో మంచి సాన్నిహిత్యం  ఉంది. ముఖ్యంగా మంచు మనోజ్ వెన్నెల కిషోర్ మధ్య స్నేహం అయితే 12 ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తుంది అని చెప్పాలి. ఇకపోతే  ఈ షోలో భాగంగా మనోజ్ తన లైఫ్ లో జరిగిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ఎన్నో ఆటంకాలు మనోవేదన తర్వాత ఇద్దరం పెళ్లి బంధంతో ఒక్కటైనట్లు చెప్పుకొచ్చాడు

 ఈ క్రమంలోనే మనోజ్ భార్య మౌనిక గతాన్ని తలుచుకొని ఎమోషనల్ అయింది అని చెప్పాలి. అమ్మ చనిపోయిన తర్వాత బర్త్ డే రోజున అలా ఆకాశం చూస్తూ ఎక్కడున్నావ్.. నాకేం కావాలో నీకు తెలుసు.. అంతా నీకే వదిలేస్తున్నాను అని మనసులో అనుకున్నాను. మనోజ్ ఆరోజు ఆళ్లగడ్డకి వస్తాడని అనుకోలేదు. నా జీవితంలో నేను అది మర్చిపోలేను అంటూ మౌనిక గతాన్ని తలచుకొని కన్నీరు పెట్టుకుంది. అయితే ఏ విషయం గురించి మౌనిక మాట్లాడింది అన్నది మాత్రం ప్రోమోలో రివీల్ చేయలేదు అని చెప్పాలి. ఇకనన్ను నమ్ముకుని ఒక బిడ్డతో అమ్మాయి లైఫ్ నిలబడి ఉంది. నేను బ్రతికి కూడా వేస్ట్ ఈ జన్మకి. ఎన్నిసార్లు డోర్లు మూస్తారో మూయండి అంటూ మనోజ్ చేసిన కామెంట్స్ కూడా హాట్ టాపిక్ గా మారిపోయాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: