ఏజెంట్: అఖిల్ సినిమాకి భయపడుతున్న బయ్యర్లు..!!

Divya
భారీ అంచనాల మధ్య విడుదలైన అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు అక్కినేని కుమారుడు అఖిల్. ఈ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో తన తొలి సినిమాకు ప్రాధాన్యత దక్కలేదు. ఇక తర్వాత రెండో సినిమా హాలో మూడవ చిత్రం మిస్టర్ మజ్ను వంటివి కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ముఖ్యంగా నాగచైతన్యకు రాని మాస్ ఇమేజ్ అక్కినేని అభిమానులు అఖిల్ కి వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. అవన్నీ కూడా ఆడియాసలుగా మిగిలిపోయాయి. ఇక తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సినిమాతో మంచి ఫలితాన్ని అందుకున్నారు అఖిల్.

అయితే ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో అఖిల్ మాస్ హీరోగా ప్రజెంట్ చేయడానికి సిద్ధమయ్యారు.అలా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా మీద 50 కోట్ల బడ్జెట్ చిత్రంలో నటించారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ చేసినప్పుడు అక్కినేని అభిమానులలో మంచి బస్సు ఏర్పడింది ఒకానొక దశలో ఆంధ్రాలో ఆరు ఏరియాలు కలుపుకొని.. రూ.30 నుంచి రూ.35 కోట్ల రూపాయలు జరిగాయని వార్తలు వినిపిస్తున్నాయి అంతగా బయర్లలో మంచి డిమాండ్ కనిపించేది.కానీ ఇప్పుడు బిజినెస్ క్లోజ్ చేయకుండా రిలీజ్ దగ్గర పడుతూ ఉండడంతో ఏజెంట్ సినిమాపై ముందు కన్నా పెద్దగా బజ్ కనిపించలేదు.

దీంతో ఇప్పుడు బిజినెస్ ఆఫర్ సగానికి పడిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆంధ్ర ప్రాంతానికి చెందిన నిర్మాతలు రూ .17 కోట్లు చేస్తే అది కూడా ఎక్కువ రేటు అన్నట్లుగా తెలియచేస్తున్నారు. సినిమాకు బస్సు తగ్గిపోవడంతో పాటు ఐపీఎల్ ఎఫెక్ట్ కూడా సినిమాల బస్సులపై గట్టిగా కనిపిస్తూ ఉండడంతో బయ్యర్లు కాస్త వెనుకడుగు వేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మిగతా ఏరియాలో కూడా ఏజెంట్ సినిమా బిజినెస్ తగ్గిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రమోషన్స్ ఎగ్జిటింగ్ వంటి జోరు పెంచితే తప్ప ఈ సినిమాకి ఒక మోస్తారు బిజినెస్ జరగడం కష్టమే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: