సమంతకు రౌడీ హీరో బూస్టింగ్..!

shami
సమంత లీడ్ రోల్ లో నటించిన శాకుంతలం సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ను గుణ శేఖర్ డైరెక్ట్ చేయగా దిల్ రాజు, నీలిమ గుణ నిర్మించారు. సినిమా పై ముందు నుంచి భారీ అంచనాలు ఉండగా వారం నుంచి భారీ ప్రమోషన్స్ లో సినిమా ని ఆడియన్స్ ను రీచ్ అయ్యేలా చేశారు చిత్ర యూనిట్. పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా కు రౌడీ హీరో విజయ్ దేవరకొండ బూస్టింగ్ ఇచ్చారు.
సమీ 1 ఇయర్ నుంచి నీకు ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని బయటకు కనిపించకుండా చిరునవ్వు తో కనిపించావు. సినిమా కోసం నువ్వు పడిన కష్టం నాకు తెలుసు శాకుంతలం సినిమా నీకు మంచి విజయాన్ని అందించాలని కోరుతున్నా ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్ పెట్టాడు విజయ్ దేవరకొండ. ఇక కొద్ది క్షణాల్లో నే విజయ్ తర్వాత హాయ్ సమీ అంటూ రష్మిక కూడా శాకుంతలం సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పేసింది.
సమంత కోసం విజయ్ తీసుకున్న ఈ స్టెప్ అందరిని మెప్పిస్తుంది. విజయ్ సమంత కలిసి ఖుషి సినిమా చేస్తున్నారు. శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్, సమంతల తో ఒక క్రేజీ లవ్ స్టోరీ చేస్తున్నాడు. సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచింది. సినిమా పవర్ స్టార్ ఖుషి లానే ఎంటర్టైనింగ్ విత్ లవ్ సాగుతుందని సినిమాకు ఆ టైటిల్ పెట్టాడట శివ నిర్వాణ. శాకుంతలం ఫలితం కచ్చితం గా ఖుషి సినిమా మీద ఉంటుంది. సమంత మాత్రం శాకుంతలం సినిమా కోసం బాగా కష్టపడింది. సినిమా పాజిటివ్ టాక్ వస్తుందని చిత్ర యూనిట్ బలంగా నమ్ముతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: