చిరంజీవి "భోళా శంకర్" మూవీలో అదిరిపోయే ట్విస్ట్..?

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి పోయిన సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. అందులో ఆచార్య మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఆ తర్వాత గాడ్ ఫాదర్ మూవీ తో చిరంజీవి ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి కానుకగా చిరంజీవి "వాల్టేరు వీరయ్య" మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

 ఈ సినిమా జనవరి 13 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఈ సినిమా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ప్రస్తుతం చిరంజీవి ... మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. చెల్లెలు సెంటిమెంట్ తో రూపొందుతున్న ఈ మూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ నటిస్తూ ఉండగా ... మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగతం అందిస్తున్నాడు.

 మిల్కీ బ్యూటీ తమన్ను ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ తమిళం లో సూపర్ హిట్ విజయం అందుకున్నటువంటి వేదాలం అనే మూవీ కి అధికారిక తెలుగు రీమేక్ గా రూపొందుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియా వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ ఇంటర్వెల్ సన్నివేశం దగ్గర ఒక అదిరిపోయే ట్విస్ట్ రానున్నట్లు ... ఆ ట్విస్ట్ తో చిరంజీవి క్యారెక్టర్ మరో లెవల్ కు వెళ్ళనున్నట్లు ... ఆ తర్వాత నుండి చిరంజీవి క్యారెక్టర్ ఈ మూవీ లో అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: