తెలుగు సినిమా హీరోలు ఆ విషయంలో మారాలి... గుణశేఖర్..!

Pulgam Srinivas
చూడాలని ఉంది మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న గుణశేఖర్ గురించి ప్రత్యేకం గా తెలుగు సినీ ప్రేమికుల పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గుణశేఖర్ "చూడాలని ఉంది" మూవీ తో సూపర్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకని ఆ తర్వాత మహేష్ బాబు హీరో గా భూమిక హీరోయిన్ గా రూపొందిన ఒక్కడు సినిమాతో మరో విజయాన్ని అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల లిస్ట్ లో చేరిపోయాడు.

ఈ దర్శకుడు రుద్రమదేవి అనే మూవీ ని తెరకెక్కించాడు. అనుష్క ఈ మూవీ లో ప్రధాన పాత్రలో నటించగా ... రానా ఈ మూవీ లో కీలక పాత్రలో నటించాడు. అల్లు అర్జున్ ఈ సినిమాలో గోన గన్నారెడ్డి అనే ఒక పవర్ఫుల్ గెస్ట్ రోల్ లో నటించాడు. ఈ మూవీ లోని అల్లు అర్జున్ నటనకు గాను అద్భుతమైన ప్రశంసలు లభించాయి. తాజాగా గుణశేఖర్ "శాకుంతలం" అనే భారీ బడ్జెట్ మూవీ ని తెరకెక్కించాడు.

 దేవ్ మోహన్ ... సమంత ఈ మూవీ లో జోడిగా నటించగా ... మోహన్ బాబు ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల సందర్భంగా గుణశేఖర్ మాట్లాడుతూ ... అనుష్క ప్రధాన పాత్రలో తాను తెరకెక్కించిన రుద్రమదేవి మూవీ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి పాత్ర చేయడం ఎంతో అభినందనీయం అన్నారు. అడిగిన వెంటనే ఆయన ఒప్పుకున్నారని ...అదే మాదిరిగా ఇతర టాలీవుడ్ హీరోలు కూడా మంచి మనసుతో ముందుకు వచ్చి అటువంటి ప్రాధాన్యత కలిగిన చిన్న పాత్రలు చేస్తే బాగుంటుందని గుణశేఖర్ అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: