దసరా సూపర్ హిట్.. రెమ్యూనరేషన్ గట్టిగా పెంచిన నాని?

praveen
నాని కెరియర్ లోనే మొదటిసారి రా అండ్ రస్టికల్ కంటెంట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చి నానీ ఎంత సూపర్ హిట్ అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణలోని వీర్లపల్లి అనే గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన దసరా సినిమా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది అని చెప్పాలి. మొదటిసారి ఇక నాని నటించిన ఒక సినిమా 100 కోట్ల కలెక్షన్ సాధించి రికార్డులు సృష్టించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా మొదటి ప్రయత్నంలోనే అటు ప్రేక్షకులను మెప్పించి సూపర్ హిట్ కొట్టేసాడు అని చెప్పాలి.

 ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ నటించింది చెప్పాలి. అయితే ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ,  హిందీ భాషలో రిలీజ్ చేశారు. కానీ మిగతా భాషల్లో పెద్దగా ప్రేక్షక ఆదరణ పొందక పోయినప్పటికీ అటు తెలుగు మార్కెట్లో మాత్రం ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి అని చెప్పాలి. నాని కెరియర్ లోనే దసరా సినిమా మొదటి 100 కోట్ల వసూళ్ల సినిమాగా నిలిచింది. ఇంత పెద్ద హిట్ వచ్చిన తర్వాత రెమ్యూనరేషన్ పెంచకుండా ఎలా ఉంటారు. ఇక నాని ఒక్కసారిగా తన పారితోషకాన్ని పెంచేశాడు అన్నది తెలుస్తుంది.

 ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా అటు నాని 20 కోట్ల రెమ్యూనేషన్ అందుకోలేదు అని చెప్పాలి. కానీ దసరా సినిమా హిట్ అయిన నేపథ్యంలో 20% రెమ్యూనరేషన్ పెంచేసాడట నాని. దీంతో ఇక తర్వాత సినిమాకు 20 కోట్లు డిమాండ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే దసరా సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే తన 30వ సినిమా మోహన్ చెరుకూరితో ప్రకటించారు నాని. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నుంచి బయటకు వచ్చిన మోహన్ చెరుకూరి కొత్త నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు అన్న విషయం తెలిసిందే. శౌర్యవ్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఇలా తన ఫ్యూచర్ సినిమాలన్నింటికీ కూడా 20 కోట్లు తీసుకోబోతున్నాడట నానీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: