నేను చిత్ర పరిశ్రమకు దూరం అవ్వడానికి కారణం అదే :: మధుబాల

murali krishna
ప్రముఖ టాలీవుడ్ నటి మధుబాల ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి. రోజా సినిమాతో ఊహించని స్థాయిలో పాపులర్ అయిన ఈ నటికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.
తెలుగుతో పాటు ఇతర భాషల్లో 50కు పైగా సినిమాల లో నటించిన ఈ నటికి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.
శాకుంతలం సినిమాలో మధుబాల కీలక పాత్ర లో నటించగా మరో 36 గంటల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మధుబాల లింగ వివక్ష గురించి మాట్లాడుతూ నా నటనా జీవితం ముగిసే సమయానికి సరైన రోల్స్ లభించలేదని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కొందరు సినీ హీరోయిన్లు ఈ పరిస్థితిని పూర్తిస్థాయిలో మార్చేశాయని ఆమె అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.
టైప్ క్యాస్ట్ గురించి మధుబాల మాట్లాడుతూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. నేను హీరోయిన్ రోల్స్ చేశానని ఆ సమయంలో హీరోయిన్లంతా టైప్ క్యాస్ట్ చేశారని ఆమె చెప్పుకొచ్చారు. మాకు కొన్ని అద్భుతమైన పాటలున్నాయని డ్యాన్స్ చేశామని రొమాంటిక్ సీన్స్ చేయడంతో పాటు వేర్వేరు భాషల్లో వైవిధ్యంతో ఉన్న పాత్రలు పోషించామని ఆమె అన్నారు. నాకు నచ్చిన రోల్స్ రాకపోవడం తో ఇండస్ట్రీకి దూరమయ్యానని మధుబాల తెలిపారు.
ఆ సమయంలో ఇంకా ఎక్కువ సినిమాల లో నటించాలని అనుకున్నానని కానీ నాకు తగిన రోల్స్ రాలేదని ఆమె చెప్పుకొచ్చారు. నేను యాక్షన్ హీరోల సినిమాలలో ఎక్కువగా నటించానని ఆమె చెప్పుకొచ్చారు. శాకుంతలం సినిమాతో మధుబాలకు మరో సక్సెస్ దక్కుతుందేమో చూడాలి. ఈ సినిమా లో ఆమె మేనక పాత్ర లో నటించారు. హీరోయిన్ సమంత శాకుంతలం సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: