గంట గంటకు పారితోషకం అడుగుతున్నా స్టార్ నటి....!!

murali krishna
టాలీవుడ్ లో ప్రస్తుతానికి హాపెనింగ్ హీరోయిన్ ఎవరు అంటే అందరూ ముక్తకంఠంతో చెప్పే పేరు శ్రీ లీల. పెళ్లి సందD సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా లాంచ్ అయిన ఈ భామ ప్రస్తుతం చేతినిండా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తోంది.
శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన పెళ్లి సందD సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ భామకు వరుస అవకాశాలు దక్కాయి.
ఇప్పటికే రవితేజతో ధమాకా సినిమా చేసిన ఈ భామ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 108వ సినిమాలో కూడా నటిస్తోంది. ఇక ఇవి కాకుండా ఈ భామ చేతిలో మరో ఎనిమిది సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఆమె మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇది కాకుండా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా ఆమె పవన్ కళ్యాణ్ సరసన నటిస్తోంది.
ఇక హీరోల సరసన మాత్రమే కాదు వైష్ణవ్ తేజ్, నవీన్ పోలిశెట్టి, విజయ్ దేవరకొండ వంటి వారి కన కూడా నటించే అవకాశాలు దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమె తన పారితోషకాన్ని అమాంతం పెంచేసినట్లుగా తెలుస్తోంది. లాంచింగ్ సినిమాకి కేవలం 50 లక్షలు మాత్రమే ఛార్జ్ చేసిన ఈ భామ ఇప్పుడు సినిమాకి కోటిన్నర వరకు డిమాండ్ చేస్తుందట. అయితే ఈ మధ్యకాలంలో ఆమె డిమాండ్ భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో ఇప్పుడు సినిమా మొత్తానికి కాకుండా ఒక్కొక్క సినిమాలో నటించేందుకు గంటలకు చార్జి చేస్తున్నట్లయితే చెబుతున్నారు.
ఒక్కొక్క సినిమాలో ఆమె ఒక్కొక్క గంటకు దాదాపు 5 లక్షల రూపాయల వరకు చార్జి చేస్తుందని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయినా సరే ఆమె చేస్తున్న దాదాపు అన్ని సినిమాలు సూపర్ హిట్ లుగా నిలుస్తున్న నేపథ్యంలో దర్శక నిర్మాతలు సైతం ఆమెను హీరోయిన్ గా ఎంచుకునేందుకే ఆసక్తి చూపిస్తున్నారని ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే ఇందులో నిజానిజాలు ఎంత మేరకు ఉన్నాయి అనే విషయం మీద మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: