భోళా శంకర్ సినిమా మరింత ఆలస్యం కానుందా...?

murali krishna
వాల్తేరు వీరయ్య తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి..సెకండ్ ఇన్నింగ్స్ లో అదిరిపోయే సక్సెస్ రేట్ తో దూసుకు పోతున్న చిరు మధ్యలో ఆచార్య మినహా అన్ని సినిమాలు కూడా హిట్ అయ్యాయి.. ఇక వాల్తేరు వీరయ్య సంక్రాంతికి విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.. ఈ సినిమా ఇచ్చిన జోష్ తో మెగాస్టార్ ఇప్పుడు ''భోళా శంకర్'' అనే సినిమా ను చేస్తున్నాడు.
తమిళ్ సూపర్ హిట్ సినిమా అయిన వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తుండగా.. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడట.ఇక ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తి సురేష్ చిరు చెల్లెలుగా నటిస్తుందని సమాచారం.. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడట.. రీమేక్ సినిమా అయినా కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. మెహర్ రమేష్ సాలిడ్ మాస్ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా చాలా భాగం పూర్తి అయ్యింది. మరి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూట్ ఇంకా నెల బ్యాలెన్స్ అయితే ఉందట.. ఈ సినిమా సమ్మర్ విడుదల వాయిదా పడింది. దీంతో కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ షూటింగ్ ను స్టార్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది.. మరి ఇంకా నెల షూటింగ్  బ్యాలెన్స్ ఉండడంతో ఎప్పుడు మొదలు పెడతారో మరి వేచి చూడాలి.. ఇక ఈ సినిమాలో అక్కినేని యువ హీరో సుశాంత్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.. మరి ఈ సినిమాను ఆగస్టు 11న విడుదల చేయాలని మేకర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు.. ఇంకా సమయం చాలానే ఉండడంతో ఎప్పుడు షూట్ పూర్తి చేస్తారో మరి తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: