ఆ బిగ్ కాంబినేషన్ మూవీ ఎప్పుడు మొదలవుతుందో...?

murali krishna
పాన్ ఇండియాను షేక్ చేసిన సెన్సేషనల్ కాంబో అంటే అది యంగ్ టైగర్ ఎన్టీఆర్  అండ్  హృతిక్ రోషన్ అనే చెప్పవచ్చు
ఈ ఊహించని కాంబో ప్రకటించడమే సెన్సేషనల్ అయ్యిందని తెలుస్తుంది... ఇక ఈ కాంబో ప్రకటించినప్పటి నుండి ఓ రేంజ్ లో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారని తెలుస్తుంది.
ఇందులో ఎన్టీఆర్ తెలుగులో బిగ్ స్టార్ అయితే హృతిక్ రోషన్ బాలీవుడ్ లో సూపర్ స్టార్ అని చెప్పవచ్చు... మరి ఇలాంటి సౌత్, నార్త్ లను ఒక్కటి చేయాలనే ఆలోచన రావడమే ఇప్పుడు ఈ హైప్ పెరగడానికి కారణం అయిందని తెలుస్తుంది... 'వార్ 2'  సినిమా ఈ కాంబోలో ఉంటుంది అని బాలీవుడ్ నుండి అధికారిక ప్రకటన వచ్చిన కూడా ముందు ఎవ్వరూ కూడా అస్సలు నమ్మలేదు.. ఇది రూమర్స్ అని అయితే కొట్టిపారేశారు.
కానీ చివరికి ఇది నిజమే అని తెలియడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే హద్దులు లేవు.. ఆర్ఆర్ఆర్ వంటి ప్రతిష్టాత్మకమైన సినిమాలో చరణ్ తో పాటు ఎన్టీఆర్ నటించిన ఆయన స్థాయిలో గుర్తింపు రాలేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ పడుతున్న సమయంలో ఇలాంటి సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఒకటి ప్రకటన రావడంతో నందమూరి ఫ్యాన్స్ కూడా ఎంతో ఆనందంగా వున్నారు..
అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ మొదటి ఛాయిస్ అయితే కాదని.. వేరే హీరోను అనుకుని చివరికి ఎన్టీఆర్ ను తీసుకున్నారని వార్తలు కూడా వచ్చాయి. దీనిపై అందుతున్న సమాచారం ఏంటంటే.. ఈ సినిమాకు ఎన్టీఆర్ మాత్రమే వన్ అండ్ ఓన్లీ ఫస్ట్ ఛాయిస్ అని వేరే ఎవ్వరిని కూడా అస్సలు మేకర్స్ అనుకోలేదని.. ఎన్టీఆర్ ను మాత్రమే అనుకుని ఆయనను సంప్రదించగా ఎన్టీఆర్ ఓకే చెప్పారనిసమాచారం.. దీంతో ఈ క్లారిటీ ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. మరి ఈ నెక్స్ట్ లెవల్ ప్రాజెక్ట్ కోసం ఇరు హీరోల ఫ్యాన్స్ ఇప్పటి నుండే ఎదురు చూస్తున్నారని తెలుస్తుంది.అయితే ఈ సినిమా అనౌన్స్ మెంట్ అయితే వచ్చింది కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మాత్రం ఇంకా వివరాలు తెలియదు.అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ ను యష్ రాజ్ ఫిలిమ్స్ పై ఆదిత్య చోప్రా  నిర్మించబోతున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: