చిరంజీవి "భోళా శంకర్" మూవీలో అలాంటి పాటలు ఏవి ఉండవట..?

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయినటువంటి వాల్తేరు వీరయ్య మూవీ తో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఈ బ్లాక్ బస్టర్ మూవీ కి బాబి దర్శకత్వం వహించగా ... శృతి హాసన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మించారు.

 ఇలా వాల్టేర్ వీరయ్య మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న చిరంజీవి ప్రస్తుతం తమన్నా హీరోయిన్ గా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో కీర్తి సురేష్ ... చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటిస్తోంది. సుశాంత్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

 ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. మరో నెల రోజుల్లో ఈ మూవీ యొక్క మొత్తం షూటింగ్ పూర్తి కానున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ఎలాంటి ఐటమ్ సాంగ్ లు కానీ ... స్పెషల్ సాంగ్ లు కానీ ఉండవని తెలుస్తోంది. అలా చిత్ర బృందం ఈ సినిమా కమర్షియల్ సినిమా అయినప్పటికీ ఎలాంటి స్పెషల్ సాంగ్ లను ... ఐటమ్ సాంగ్ లను కానీ ఈ మూవీ లో పెట్టే ఉద్దేశంలో కూడా లేనట్లు తెలుస్తుంది. వాల్టేర్ వీరయ్య మూవీ తర్వాత చిరంజీవి నుండి రాబోతున్న సినిమా కావడంతో భోళా శంకర్ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నిలకోని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: