రజిని 170వ మూవీ ప్రారంభం అయ్యేది అప్పటి నుండే..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ రజినీ కాంత్ ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఇప్పటికే ఈ సంవత్సరం ఆగస్టు  11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ లో రమ్య కృష్ణ ... తమన్నా కీలక పాత్రలలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ మరి కొంత భాగం మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు ... మరి కొన్ని రోజుల్లోనే ఈ బ్యాలెన్స్ షూటింగ్ కూడా పూర్తి చేసి ఈ చిత్ర బృందం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే రజినీ తన కెరియర్ లో 170 వ మూవీ షూటింగ్ ని మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా రజిని 170 వ మూవీ కి టీ జే జ్ఞానవేల్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ దర్శకుడు కొంత కాలం క్రితమే సూర్యా హీరో గా రూపొందిన జై భీమ్ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ నేరుగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలను అందుకుంది. ఈ మూవీ ద్వారా జ్ఞానవేల్ కు కూడా దర్శకుడుగా అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఇది ఇలా ఉంటే రజిని ... జ్ఞానవేల్ కాంబినేషన్ లో రూపొందబోయే మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: