చిన్న సినిమాలు మైత్రి బ్యానర్ కు కలిసి రావడం లేదా..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం అద్భుతమైన క్రేజ్ ఉన్న నిర్మాణ సంస్థగా కొనసాగుతున్న సంస్థ లలో మైత్రి మూవీ సంస్థ ఒకటి. ఈ సంస్థ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన శ్రీ మంతుడు మూవీ తో నిర్మాణ రంగం లోకి అడుగు పెట్టింది. ఆ తరువాత జనతా గ్యారేజ్ ... రంగస్థలం మూవీ లతో వరుస విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ ప్రొడక్షన్ హౌస్ గా మారిపోయింది.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థ ఎంతో మంది స్టార్ హీరోలతో ... మీడియం రేంజ్ హీరో లతో ... చిన్న హీరో లతో సినిమాలను నిర్మించింది. ఇది ఇలా ఉంటే మైత్రి సంస్థ ఇప్పటికీ ఎంతో మంది స్టార్ హీరోలతో అద్భుతమైన విజయాలను అందుకుంది. కాకపోతే ఈ సంస్థ నిర్మించిన చిన్న సినిమాలు మాత్రం చాలా తక్కువ శాతం విజయాలను అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈ నిర్మాణ సంస్థ హ్యాపీ బర్త్ డే ... ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ...  మీటర్ అనే మూడు చిన్న మూవీ లను నిర్మించింది.

ఈ మూవీ లను మైత్రి మూవీ సంస్థ నిర్మించడంతో ప్రేక్షకులు ఈ సినిమాలపై మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూడు సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయ్యాయి. హ్యాపీ బర్త్ డే మూవీ లో లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించగా ...  ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ లో సుధీర్ బాబు హీరో గా నటించాడు. మీటర్ మూవీ లో కిరణ్ అబ్బవరం హీరో గా నటించాడు. ఈ మూవీ తాజాగా ఏప్రిల్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: